Nimmagadda: జగన్ కెరీర్ కే అతిపెద్ద టర్నింగ్ పాయింట్ – నిమ్మగడ్డ గెలుపు మొదలైన సీన్ ఇదే ?

Nimmagadda( నిమ్మగడ్డ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఏదన్నా హాట్ టాపిక్ ఉందంటే అది ఎన్నికల గురించే మాత్రమే. అయితే ఇప్పుడు ఎవరి నోటి వెంట ఎవరి మాటవిన్నాగాని అది ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించే. అసలు చాలా మందికి నిమ్మగడ్డ పేరు తెలియదు కానీ ఇప్పుడు ఆయన పేరు తెలియని రాజకీయ పార్టీలు లేవు అలాగే ప్రజలు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. దాదాపు ఏడాది క్రితం అంటే గతేడాది ఫిబ్రవరిలో ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ నోటిఫికేష్‌ విడుదల చేశారు. కానీ అప్పట్లో ఎన్నికలకు వైసీపీకే కాదు ఏ రాజకీయ పార్టీకి కూడా పెద్దగా ఎటువంటి అభ్యంతరాల్లేవు. కానీ కరోనా పేరుతో స్ధానిక ఎన్నికలను వాయిదా వేస్తూ నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయంతో సీఎం జగన్ మండిపడ్డారు.  ఇక అప్పటి నుంచి వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే చాలు బగ్గు మంటుంది. దాదాపు ఏడాదిగా జరిగిన పరిణామాలు ఏపీ చరిత్రలోనే తొలిసారిగా నిలిచాయి.కరోనా ప్రభావం తగ్గిపోవడంతో ఎన్నికలకు సిద్దమయ్యాడు నిమ్మగడ్డ.

 Nimmagadda took lead on ys jagan in ap local elections నిమ్మగడ్డ
Nimmagadda took lead on ys jagan in ap local elections

ఇతన్ని ఎలా కట్టుదిట్టం చేయాలో అర్ధంకాగా ప్రభుత్వం చివరికి వ్యాక్సినేషన్‌ను తెరపైకి తెచ్చింది. అయితే పరిమితంగా సాగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కానీ, షెడ్యూల్‌ కానీ ఎన్నికలకు ఆటంకం కాలేదు. కోర్టులను సైతం జగన్ సర్కార్ ఆశ్రయించింది. కానీ ఎక్కడకి వెళ్లిన ఒకటే మాట ఎన్నికలు జరగాలని. దీంతో ఉద్యోగుల భయాన్ని తెరపైకి తెచ్చి ఎన్నికలను వాయిదా కోరడం మొదలుపెట్టింది. మా ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తించలేమంటూ ఉద్యోగులతో చెప్పించింది. ఈ వాదనకు కోర్టులు అంగీకరిస్తాయో లేదో తెలియని పరిస్ధితి.కానీ ఇదే అదునుగా భావించి హైకోర్టు ఎప్పుడైతే ఎన్నికలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసిందో గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ విడుదలకు నిమ్మగడ్డ సిద్ధమైపోయారు. హైకోర్టు తీర్పును వైసీపీ సర్కారు సుప్రీంకోర్టులో సవాల్ చేసిందని తెలిసి కూడా ఒకేసారి నాలుగు విడతలలో ఎన్నికలకు సిద్ధం అయింది. హైకోర్టు తీర్పును తప్పుపడుతూ ఏపీ సర్కార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించి దాఖలు చేసిన పిటిషన్‌లో తప్పులున్నాయని రిజిస్ట్రీర్ తిరస్కరించిందో అక్కడే నిమ్మగడ్డ సగం గెలిచేశారు. . ఇప్పుడిక మిగిలింది సుప్రీంకోర్టు తీర్పు.

సోమవారం నిమ్మగడ్డ వ్యవహారశైలిని సుప్రీంకోర్టులో సవాల్‌ చేసే క్రమంలో పిటిషన్లలో ప్రభుత్వం వాడిన భాష మరింత సమస్యను తెచ్చిపెట్టింది. ఏకంగా సుప్రీంకోర్టుకు ఇందులో ఇగో రాజకీయం ఉందని అర్ధమయ్యేలా చేసింది. దీంతో సుప్రీంకోర్టులోనూ సర్కారుకు ఊరట దక్కకుండా పోయింది.సుప్రీంకోర్టు పంచాయతీ ఎన్నికలపై ఇచ్చిన తీర్పు ఓ ఎత్తయితే తీర్పు సందర్భంగా చేసిన వ్యాఖ్యలు మరో సంచలనం. నిమ్మగడ్డ వర్సెస్‌ జగన్‌ మధ్య సాగుతున్న ఈ పోరు విషయంలో పరోక్షంగా తమను లాగొద్దంటూ చెప్పకనే చెప్పింది. దీంతో పంచాయతీ ఎన్నికలే కాదు వీటి తర్వాత పెండింగ్‌లో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలూ నిర్వహించేందుకు కూడా నిమ్మగడ్డ రెడీ అయ్యారని తెలుస్తుంది. మొత్తానికి తన పదవి కాలం ముగిసే సమయానికి అన్ని ఎన్నికలూ పూర్తి చేయాలని నిమ్మగడ్డ టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది. !

Advertisement