Nimmagadda : నిమ్మగడ్డ వదిలిన బాణానికి వైసీపీ గిలగిలా..!!

big bad news for nimmagadda ramesh about ap local body elections
big bad news for nimmagadda ramesh about ap local body elections

Nimmagadda : ఎన్ని ఒడిదుడుకులు వచ్చినాగాని ఎన్నికలు ఆపేది లేదని నిమ్మగడ్డ ముందుకు సాగిపోతున్నారు. అయితే ఎన్నికల మీద రెవిన్యూ ఉద్యోగులకు సంబందించిన కొన్ని విషయాలని వినతి పత్రం రూపంలో ఎన్నికల కమిషనర్ అయిన రమేష్ కుమార్ కు ఇవ్వాలని రెవిన్యూ ఉద్యోగ సంఘాల జెఎసి నేతలు ఆయనను కలిసారు. ఈ నేపథ్యంలో బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… ఎపి జేఎసి అమరావతి పక్షాన ఎన్నికల కమిషనర్ ను కలిశాం అని ఆయన వివరించారు. ఈనెల‌27న కార్యవర్గం లో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలను వినతి పత్రం రూపంలో అందించామని తెలిపారు. ప్రస్తుత తరుణంలో కోవిడ్ వ్యాక్సిన్ ను కేవలం ఫ్రంట్ లైన్ వారియర్స్ కి మాత్రమే ఇస్తున్నారు అని, వీలయితే ఎన్నికలలో పాల్గొనే ఉద్యోగులకు కూడా వ్యాక్సిన్ వేయాలని కోరారు.

Nimmagadda strong Decisions about elections నిమ్మగడ్డ
Nimmagadda strong Decisions about elections

ఇంత సడెన్ గా వచ్చిన ఎన్నికల నోటిఫికేషన్ చూసి షాక్ లో ఉన్నామని, ఈ ఎన్నికల ప్రక్రియను కొంతకాలం పాటు వాయిదా వేయాలని ఎన్నికల కమిషనర్ ను అడిగామని ఆయన వివరించారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఎన్నికలకు సిద్దంగా ఉన్నామని కమిషనర్ కు తెలిపారు . అలాగే రెండు, మూడు, విడతల‌ షెడ్యూల్ ను కూడా అవకాశం ఉంటే తర్వాత జరిపించాలని కోరారు. ఉద్యోగ సంఘాల నేతలు చెప్పిన అన్నీ విషయాలను కమిషనర్ కూడా సానుకూలంగా విని, ప్రస్తుత పరిస్థితి లో ఎన్నికలను రీ షెడ్యూల్ చేసే అవకాశం లేదని‌ చెప్పారు అని ఆయన వివరించారు.

హఠాత్తుగా వచ్చిన ఎన్నికలకు సరైన శిక్షణ లేకుండా విధుల్లో కి వెళ్లాలంటే ఉద్యోగులు తీవ్రమైన ఒత్తిడి కి గురవుతున్నారని, ఒకవేళ ఏదయినా చిన్న చిన్న తప్పులు జరిగిన కానీ వాటిని పెద్దవిగా చేసి ఉద్యోగులు పై తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని కోరాం అని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా కరోనా వైరస్ ను దృష్టిలో పెట్టుకుని యాభై సంవత్సరాల వయసు పైబడిన‌ వారిని,వేరే దీర్ఘకాలిక వ్యాధితో బాధ పడేవారిని, గర్భిణీ స్త్రీలు ను ఎన్నికలకు దూరంగా ఉంచాలని ఆయన కోరారు. అలాగే ఎన్నికలు ఉదయం‌ 6.30నుండి మధ్యాహ్నం 3.30కి పోలీంగ్ ముగిశాక కౌంటింగ్ ప్రారంభిస్తారు అని అన్నారు.

Advertisement