Nimmagadda : తాజా వార్త : నేనైతే అసెంబ్లీ హక్కులను ఉల్లంఘించలేదు.. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి..

Nimmagadda : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ తనకు పంపిన నోటీసుపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ శుక్రవారం సాయంత్రం స్పందించారు. శాసన సభ్యుల సభా హక్కులను తాను ఉల్లంఘించానన్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ఆరోపణల్ని ఖండించారు. అసెంబ్లీ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. ఎమ్మెల్యేల హక్కులు ఉలంఘించానంటున్న ఈ నోటీసులకు అసలు విచారణ పరిధే లేదని నిమ్మగడ్డ తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆయన శాసన సభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులకు ఇవాళ లెటర్ పంపారు.

టీకా వేయించుకున్నా..

ఇటీవలే తాను కొవిడ్-19 టీకా వేయించుకున్నానని నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్న తాను ఈ నేపథ్యంలో ప్రయాణాలు చేయలేనని, విచారణకు హాజరు కాలేనని నిస్సహాయత వ్యక్తం చేశారు. సభా హక్కుల ఉల్లంఘటన నోటీసులపై ప్రివిలేజ్ కమిటీ మరింత ముందుకు వెళ్లాలని భావిస్తే వెళ్లొచ్చని, తన వాదనకు తగిన ఆధారాలు చూపిస్తానని పేర్కొన్నారు. అయితే ఈ మేరకు తనకు తగినంత సమయం ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. ఎస్ఈసీ ఇచ్చిన వివరణపై ప్రివిలేజ్ కమిటీ సంతృప్తి చెందుతున్నా, ఆయన అడిగినట్లు మరికొంత సమయం ఇస్తుందా లేదా అనేది చూడాలి.

Nimmagadda : sec nimmagadda ramesh sent reply to ap assembly privilege committe
Nimmagadda : sec nimmagadda ramesh sent reply to ap assembly privilege committe

మరోసారి కోర్టుకి?: Nimmagadda

శాసన సభా హక్కుల కమిటీ ఇచ్చిన నోటీసుకు అసలు విచారణ పరిధే లేదనటం ద్వారా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి ప్రభుత్వంతో కయ్యానికి సిద్ధంగా ఉన్నట్లు అర్థమవుతోంది. అవసరమైతే మళ్లీ కోర్టును ఆశ్రయించాలనేది ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. దీన్నిబట్టి నిమ్మగడ్డ బహుశా ప్రివిలేజ్ కమిటీ ముందుకు హాజరయ్యే అవకాశాల్లేవని చెప్పొచ్చు. మంత్రుల విషయంలో తాను చేసింది కరెక్ట్ అని నిరూపించుకోవటానికి తన దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయనటం ద్వారా ‘‘మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మీ ఇష్టం’’ అన్నట్లు పరోక్షంగా చెప్పాడని విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల మాదిరిగానే ఈ కేసు కూడా ఎన్ని మలుపులు తిరిగిద్దో చూడాలి.

Advertisement