Nimmagadda : ‘వాళ్లని వదిలే సమస్యే లేదు’.. బాహుబలి క్లైమ్యాక్స్ రేంజ్ లో శవం ముందు నిమ్మగడ్డ సీరియస్ వార్నింగ్!

Nimmagadda : తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి పుష్పవతి భర్త శ్రీనివాస్ రెడ్డ ఆదివారం అర్ధరాత్రి కిడ్నాప్ కి గురై, సోమవారం రాత్రి పొలంలో చెట్టుకు వేలాడుతూ కనిపించటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బాధిత కుటుంబాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిన్న (మంగళవారం) స్వయంగా పరామర్శించటం, ‘నిందితుల్ని వదిలే సమస్యే లేదు’ అంటూ బాహుబలి సినిమా క్లైమ్యాక్స్ రేంజ్ లో సీరియస్ వార్నింగ్ ఇవ్వటం మరింత సెన్సేషన్ గా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య, నిమ్మగడ్డ మీద విమర్శలకు దారితీసింది.

ఆ పాపం..

శ్రీనివాస్ రెడ్డి మృతికి సీఎం జగనే బాధ్యత వహించాలని, లేకుంటే ఆ పాపం తప్పకుండా తగులుతుందని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) శాపనార్థాలు పెడుతోంది. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు పర్యటిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. మృతుడు శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్థానికులను, ఆఫీసర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్ష పడే తీరుతుందని శపథం చేశారు. ప్రతి అంశాన్నీ రాజకీయం చేయటం తగదు అంటూ పొలిటికల్ పార్టీలకు హితవు పలికారు.

ఇంకా : Nimmagadda

శ్రీనివాస్ రెడ్డి డెడ్ బాడీకి పోస్టుమార్టం పారదర్శకంగా జరిపిస్తామని ఎస్ఈసీ హామీ ఇచ్చారు. గొల్లలగుంట పంచాయతీ ఎన్నికల విషయాన్ని తర్వాత పరిశీలిస్తామని చెప్పారు. జగ్గంపేట మండల సీఐ సురేష్ బాబు, ఎస్ఐ రామకృష్ణపై యాక్షన్ తీసుకోవాలని, వాళ్లిద్దర్నీ వాలంటరీ రిటైర్మెంట్(వీఆర్)కి పంపాలని రమేష్ కుమార్ జిల్లా ఎస్పీని స్పాట్ లో ఆదేశించారు. కేసు దర్యాప్తును ఎస్పీయే స్వయంగా పర్యవేక్షించాలని కూడా చెప్పారు.

Nimmagadda : sec-nimmagadda-ramesh-kumar-serious-warning
Nimmagadda : sec-nimmagadda-ramesh-kumar-serious-warning

నిమ్మగడ్డ.. నిమ్మాడ పోలేదేం?

నిన్న నిమ్మగడ్డ వ్యవహరించిన తీరు ఇంతవరకూ బాగానే ఉంది కానీ శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నేతల చేతుల్లో మూడు రోజుల కిందట తీవ్రంగా దాడికి గురైన సర్పంచ్ అభ్యర్థి కింజరపు అప్పన్నను రమేష్ కుమార్ ఇంతవరకూ ఎందుకు పరామర్శించలేదని వైఎస్సార్సీపీ నిలదీసింది. అప్పన్నకు తమ మద్దతు ఉండటం వల్లే నిమ్మగడ్డ నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించారా అని మండిపడింది. ఆయన టీడీపీ పక్షపాతి అనటానికి ఇది మరో నిదర్శనమని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం రాత్రి సూటిగా ప్రశ్నించారు. దీనికి ఎస్ఈసీ ఏం సమాధానం చెబుతారో చూడాలి.

Advertisement