Nimmagadda : రాజశేఖర్ రెడ్డి వల్లే నేనిక్కడున్నా

Nimmagadda : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఏపీఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ రోజురోజుకీ స్వరం పెంచుతున్నారు. నిన్న ఇద్దరు మంత్రులను, ఒక ఎంపీని, ఒక ప్రభుత్వ సలహాదారుని టార్గెట్ చేసిన ఆయన ఈరోజు పరోక్షంగా సీఎం జగ్మోహన్ రెడ్డినే లక్ష్యంగా పెట్టుకొని సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం కడప జిల్లాలో పర్యటించిన నిమ్మగడ్డ.. మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్సార్ తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

పెద్దాయన..

దివంగత నేత, ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిజంగా పెద్దాయన, మంచి మనసున్న లీడర్ అంటూ నిమ్మగడ్డ ప్రశంసలు కురిపించారు. తానిప్పుడు ఈ స్థితిలో ఉండటానికి వైఎస్సారే కారణమని చెప్పారు. నిజాలు చెప్పేటప్పుడు భయపడాల్సిన పనిలేదనే ధైర్యాన్ని, స్వేచ్ఛను ఆయనే నాలో నింపారని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి దగ్గర పనిచేయటమే తన లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అని చెప్పారు.

అప్పట్లో: Nimmagadda

‘‘ఆ రోజుల్లో అంటే వైఎస్సార్ బతికున్న రోజుల్లో నేను ఆయన దగ్గర ఫైనాన్స్ సెక్రెటరీగా చేసేవాణ్ని. నాకు ఆ గొప్ప నాయకుడి ఆశీస్సులున్నాయి. గవర్నర్ ఆఫీసు(రాజ్ భవన్) కారణంగానే నేను స్టేట్ ఎలక్షన్ కమిషనర్(ఎస్ఈసీ)ని కాగలిగాను. రాజ్యాంగం అంటే వైఎస్ కి ఎనలేని గౌరవం. అనేక ముఖ్యాంశాల్లో భావ ప్రకటనా స్వేచ్ఛ కల్పించారు. ఆయన ఏనాడూ ఏ వ్యవస్థనీ తక్కువ చేసి చూడలేదు. అందువల్ల వైఎస్ దగ్గర పని చేసినప్పుడు నేను ఏ ఇబ్బందీ పడలేదు’’ అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు.

డోంట్ కేర్..

ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాలకు తాను ప్రత్యక్ష సాక్షినని ఎస్ఈసీ తెలిపారు. తనను ఏ శక్తీ ఏమీ చేయజాలదని తేల్చిచెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ లో అన్ని మతాలనూ సమానంగా చూసే లౌకిక దృక్పథం ఉండేదని నిమ్మగడ్డ కొనియాడారు. ప్రజాస్వామ్యం ఎంతో గొప్పదని, రాజ్యాంగం ప్రకారమే ఎలక్షన్లు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.

Nimmagadda-remembered-ys-rajashekhar-reddy
Nimmagadda-remembered-ys-rajashekhar-reddy

ఒప్పుకోం: Nimmagadda

‘‘పంచాయతీల్ని బలవంతంగా ఏకగ్రీవం చేయించేందుకు ప్రయత్నించేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. వాళ్లను సమర్థవంతంగా కట్టడి చేసి ఇళ్లకే పరిమితం చేస్తాం. బెదిరింపులకు పాల్పడటం, భయపెట్టడం వంటి నేరాలు చేసేవాళ్లను గుర్తించేందుకు షాడో టీమ్స్ ని ఏర్పాటు చేస్తాం. అపొజిషన్ పార్టీలకు ఇకపై వేధింపులు ఉండవు. వ్యక్తిగత అజెండాలను వ్యవస్థలతో ముడిపెట్టడం సరికాదు’’ అని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హితవు పలికారు.

Advertisement