Nimmagadda : రూట్ మార్చి వైస్ ని పొగడ్తలతో ముంచెత్తిన నిమ్మగడ్డ…షాక్ లో ప్రతి పక్షాలు

Nimmagadda: ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ నేతలు, మద్దతు దారులందరూ కూడా అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినట్లు నిమ్మగడ్డ వింటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని వైసీపీ నాయకులు తీవ్ర ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ సంచలన వ్యాఖ్యలు చేసి అందరికీ షాక్ ఇచ్చారనే చెప్పాలి. శనివారం రోజు కడప జిల్లాలో పర్యటించిన నిమ్మగడ్డ వైఎస్ఆర్ ని బాగా కొనియాడారు. ఒంటిమిట్టలో కోదండ రాముడి గుడి ని దర్శించుకున్న తరువాత నిమ్మగడ్డ మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్సార్ ని బాగా కొనియాడారు.

తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం వైఎస్ఆరే అని నిమ్మగడ్డ చెప్పుకొచ్చారు. వైయస్ రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేయడం వల్ల తన జీవితంలో ఓ గొప్ప మలుపు వచ్చిందని ఆయన అన్నారు. వైఎస్సాఆర్ తనని ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమించారని.. ఆయన దగ్గరే మూడేళ్లపాటు ఫైనాన్స్ సెక్రటరీగా పని చేశానని నిమ్మగడ్డ చెప్పుకొచ్చారు. అనంతరం రాజ్‌భవన్‌లో ఉన్నత పదవిలో నియమించారని.. అక్కడ 7 ఏళ్ళు పని చేసిన తర్వాత తనని రాజ్‌భవనే ఎన్నికల కమిషనర్ గా నియమించింది అని నిమ్మగడ్డ చెప్పుకొచ్చారు. అయితే తనను ఎవరో నియమించారని కొందరు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని నిమ్మగడ్డ స్పష్టం చేశారు.

రాజ్యాంగం పట్ల వైఎస్.రాజశేఖర్ రెడ్డి కి ఎంతో గౌరవం ఉండేదని.. ఆయన ఏ వ్యవస్థను ఏనాడూ కూడా తప్పు పెట్టలేదని.. ఆయన దగ్గర పని చేసిన రోజుల్లో ఎప్పుడు కూడా తనని ఇబ్బంది పెట్టలేదని నిమ్మగడ్డ గుర్తుకు తెచ్చుకున్నారు. తనను ఏ శక్తి అడ్డుకోలేదని, అడ్డుకోబోదని నిమ్మగడ్డ తేల్చి చెప్పారు. నిజం అనేది ప్రజాస్వామ్యం నుంచి వచ్చిందని.. సరైన కాలంలో ఎలక్షన్లు జరిగితే ప్రజాస్వామ్యానికి మంచి జరుగుతుందని ఆయన అన్నారు.

Advertisement