Nimmagadda : సెన్సేషనల్ న్యూస్ : తెలంగాణలోనూ నిమ్మగడ్డ రమేష్ కుమార్..
Kondala Rao - January 30, 2021 / 01:59 PM IST

Nimmagadda : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఏపీఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు అందరికీ రోల్ మోడల్ గా మారినట్లున్నాడు. రాజ్యాంగం పవరేంటో చూపిస్తున్నాడు. ఆయన చూపించిన బాటలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (టీఎస్ఈసీ) పార్ధసారధి కూడా నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే.. నిన్న ఓ ప్రముఖ తెలుగు దినపత్రికలో వచ్చిన ఒక వార్త ఇదే అభిప్రాయాన్ని కలిగిస్తోంది.
అందులో..?
తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ల పాలక వర్గం గడువు మార్చి 14న ముగిసిపోనుంది. ఈ రెండింటితోపాటు ఆరు (అచ్చంపేట, సిద్ధిపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు, జహీరాబాద్) మునిసిపాలిటీలకు కూడా ఎలక్షన్స్ పెట్టాల్సి ఉంది. దీనికోసం వార్డుల పునర్విభజన, ఓటర్ల లిస్టు పబ్లిషింగ్, పోలింగ్ స్టేషన్ల ఎంపిక వంటివి చేయాలి.
అయితే..?: Nimmagadda
ఈ విషయాల్ని గుర్తుచేస్తూ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం గత (డిసెంబర్) నెల 14న మునిసిపల్ మంత్రిత్వ శాఖకు లెటర్ రాసింది. ఇది జరిగి ఇప్పటికి నెలన్నర గడిచిపోయింది. అయినా అటు నుంచి రిప్లై రాలేదు. దీంతో టీఎస్ఈసీ లేటెస్టుగా మరో లెటర్ పంపింది. కానీ, ఈ సారి కాస్త ఘాటుగా సంధించింది. తాజా లెటర్ చూస్తే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్ధసారధిలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రవేశించాడా అనే డౌటొస్తోంది.
రాజ్యాంగం..
తెలంగాణ రాష్ట్రంలోని నగర పాలక సంస్థలకు (మునిసిపల్ కార్పొరేషన్లకు), పురపాలక సంఘాలకు (మునిసిపాలిటీలకు) గడువు లోపు ఎన్నికలు నిర్వహించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని పార్ధసారధి తాజా లేఖలో కోరారు. న్యాయపరమైన వివాదాలకు దారితీయక ముందే స్పందించాలని సుతిమెత్తగా హెచ్చరించారు. రాజ్యాంగం చెప్పినట్లు డెడ్ లైన్ లోపు ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వం కోపరేట్ చేయాల్సిందేనని తేల్చిచెప్పారు.
కోర్టులు..
ఎలక్షన్స్ విషయంలో సహకరించకపోతే ఎన్నికల సంఘం హైకోర్టుకు, అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లొచ్చంటూ దేశ అత్యున్నత న్యాయస్థానమే గతంలో చెప్పిందని లేటెస్ట్ లెటర్ లో పార్ధసారధి ప్రస్తావించారు. మార్చి తొలి వారంలో ఎలక్షన్స్ పూర్తయితేనే పాలక వర్గాల గడువు ముగిసేలోపు ఛైర్మన్, మేయర్ల ఎన్నికకు మార్గం సుగమమవుతుందని వివరించారు.

Nimmagadda-nimmagadda-ramesh-kumar-in-telangana-also
ఏర్పాట్లు: Nimmagadda
వరంగల్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ల ఎలక్షన్లకి మార్చి మొదటి వారంలోగా ఏర్పాట్లు చేయాలని టీఎస్ఈసీ.. మునిసిపల్ మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. సిద్ధిపేట పాలక వర్గం ఏప్రిల్ 15 వరకు ఉంటుందని తెలిపింది. మరోవైపు.. నకిరేకల్ పంచాయతీ గడువు డిసెంబర్ 15నే ముగిసినప్పటికీ అది తాజాగా మునిసిపాలిటీ అయిందని పేర్కొంది. జడ్చర్ల, జహీరాబాద్ మునిసిపాలిటీలకు గతంలో ఎలక్షన్స్ జరగలేదని, అందువల్ల ఇప్పుడు వాటికీ ఎన్నికలు నిర్వహించాలని తెలిపింది.