Nimmagadda (నిమ్మగడ్డ): కొన్ని రోజుల క్రితం వరకు అసలు ఏపీ రాష్ట్రా ఎన్నికల అధికారి ఎవరనే విషయం కూడా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఆ అధికారి పేరు రాష్ట్రం మొత్తం మారుమోగిపోతుంది. ఆ పేరు మరెవరిదో కాదు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ది. ఈయన పేరు ఇప్పుడు ఏడాది నుంచి మీడియాలో సంచలనమయ్యింది. పదవి పోయినా గాని పట్టు విడవకుండా పోయిన పదవిని తిరిగి రప్పించుకున్నారు. అలాగే ఏపీ సర్కార్ ఎన్నికలు వద్దు అంటున్న గాని నిమ్మగడ్డ మాత్రం అనుకున్నది సాధించి ఎన్నికలను నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ నిమ్మగడ్డ ఒక సరి కొత్త ప్లాన్ తో ముందుకు వెళ్ళబోతున్నట్లు తెలుస్తుంది. ఆయన ఎత్తుగడ ఏంటో మీరు తెలుసుకుంటే నిజంగా ఆయన ముందుచూపుకి సలామ్ కొడతారు. కేవలం నిమ్మగడ్డ పంచాయతీ ఎన్నికలకే పరిమితం అవుతాడు అని అందరు అనుకుని ఉంటారు. ఎందుకంటే ఒక నెలలో నిమ్మగడ్డ పదవి విరమణ చేస్తారు కాబట్టి. కానీ నిమ్మగడ్డ మాత్రం వరసపెట్టి ఏపీలో మునిసిపల్ ఎన్నికలను, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను కూడా నిర్వహించాలని భావిస్తున్నారు..

కానీ అదెలా సాధ్యం అని అనుకుంటున్నారా.. ఇక్కడే ఉంది మనకి తెలియని ఒక లాజిక్. అదేంటంటే నిమ్మగడ్డ ఇప్పుడు తన పదవీకాలాన్ని పొడిగించుకోవాలని చూస్తున్నారట. అసలు మేటర్ ఏంటంటే గత ఏడాది ఏప్రిల్ నెలలో ఉన్నటుండి వైసీపీ ప్రభుత్వం మద్రాస్ కోర్టు మాజీ న్యాయమూర్తి కనగరాజ్ ని తెచ్చి నిమ్మగడ్డ స్థానంలో కూర్చోబెట్టారు. అయితే ఈ విషయాన్నీ నిమ్మగడ్డ సీరియస్ గా తీసుకుని కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. మొత్తానికి నిమ్మగడ్డ కోర్టులో గెలిచి తన పదవిని మళ్ళీ తిరిగి పొందారు.అయితే ఇప్పుడు ఆయన పదవి కాలం మార్చి 31 తో అయిపోతుంది. ఆ సమయానికల్లా కేవలం పంచాయతీ ఎన్నికలు మాత్రమే అయిపోతాయి. మిగతా ఎన్నికలకు ఆయన ఉండరు.
అందుకని తెలివిగా నిమ్మగడ్డ గతంలో కోర్టుల చుట్టూ తిరగడం వలన అతని విలువైన పదవీకాలం ఒక రెండు నెలలు పోయింది. దాంతో ఇప్పుడు ఆ పదవీకాలన్ని తనకు మళ్ళీ ఇప్పించాలని ఆయన కోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం ఎన్నికల మధ్యలోనే ఆపేసి పదవి విరమణ చేయకుండా రెండు నెలల కాలం పొడిగిస్తే అన్నీ ఎన్నికలను నిర్వహించి నిమ్మగడ్డ పదవి విరమణ చేయాలనీ భావిస్తున్నారట. ఒక వేళ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇస్తే మాత్రం మార్చి 31 కాదు మే 31 వరకూ కూడా ఆయనే ఎన్నికల ప్రధానాధికారిగా కొనసాగుతారు అన్నమాట. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే వైసీపీ సర్కార్ కి భారీ షాక్ తగిలినట్లే అంటున్నారు.