Nimmagadda : ‘మా బాబే’.. అన్నారుగా.. ఇప్పుడైనా నోరు మూసుకుంటారా?

Nimmagadda : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఏపీఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిన్న(శనివారం) తనలోని రెండో కోణాన్ని చూపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పొగడటమే కాకుండా టీడీపీ చీఫ్ చంద్రబాబుకు నోటీసు కూడా ఇచ్చారు. తద్వారా అధికార పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అయినా నా దృష్టిలో ఒకటేనని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీవాళ్లు ఇన్నాళ్లూ తనపై చేస్తున్న ఆరోపణలు తప్పు అని నిరూపించుకున్నారు.

టీడీపీకీ..

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) గురువారం ‘పల్లె ప్రగతి – పంచ సూత్రాలు’ పేరుతో విడుదల చేసిన ఎలక్షన్ మ్యానిఫెస్టోపై ఎస్ఈసీ స్పందించింది. పొలిటికల్ పార్టీల రహితంగా జరిగే పంచాయతీ ఎలక్షన్స్ కి ఎన్నికల ప్రణాళిక విడుదల చేయటంపై వైఎస్సార్సీపీ నిమ్మగడ్డకి శుక్రవారమే ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన టీడీపీకి శనివారం నోటీసులు జారీ చేశారు. మంగళవారం (ఫిబ్రవరి 2) నాటికి వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

రూల్సివీ: Nimmagadda

పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం.. పంచాయతీ ఎలక్షన్స్ కి మ్యానిఫెస్టో విడుదల చేయటం నియమావళి(కోడ్)కి విరుద్ధం. ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ పార్టీల గుర్తులు (సింబల్స్), కర పత్రాలు (పాంప్లెట్స్), ఫ్లెక్సీలు వాడకూడదు. అయితే ఈ కోడ్ కి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ మ్యానిఫెస్టోని రిలీజ్ చేయటంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్ అయ్యారు. ఆ పార్టీపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకు వీలుగా త్వరగా వివరణ ఇవ్వాలని టీడీపీ హైకమాండ్ ని నోటీసు ద్వారా ఆదేశించారు.

Nimmagadda : issued notice to tdp
Nimmagadda : issued notice to tdp

ఇప్పుడేమంటారు?..

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మొదలుకొని ఆయన పార్టీ నాయకులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఇలా ప్రతిఒక్కరూ దాదాపు ఏడాది కాలంగా ఎస్ఈసీ నిమ్మగడ్డని చంద్రబాబు ఏజెంట్ అంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. చంద్రబాబుది, నిమ్మగడ్డదీ ఒకే కులం అని కూడా వేలెత్తి చూపారు. నిమ్మగడ్డని ఎస్ఈసీగా చంద్రబాబే నియమించాడని, అందుకే అతను తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు కాపాడేందుకు తాము వద్దంటున్నా వినకుండా పంచాయతీ ఎన్నికలు పెడుతున్నాడని అభ్యంతరం తెలిపారు. అసభ్యంగా కూడా మాట్లాడారు. అయినా వాటిని పట్టించుకోకుండా నిమ్మగడ్డ ఈ రోజు టీడీపీకి కూడా నోటీసులు జారీ చేసి అధికార పార్టీవాళ్ల ఆరోపణలకు సరైన సమాధానం చెప్పారనే టాక్ వినిపిస్తోంది.

Advertisement