ఏపీలో కొత్త కరోనా వేరియంట్ ఎన్ 440k.. సంచలన విషయాలతో చంద్రబాబు

చంద్రబాబు ఎప్పుడు మీడియా ముందుకు వచ్చిన వాటిలో 99 శాతం రాజకీయాలకు సంబధించిన విషయాలే చెపుతాడు. కానీ ఈ కొత్తగా కరోనా గురించి సరికొత్త విషయం చెప్పటమే కాకుండా అనేక భయాలను కలిగించాడు. ఈ చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం ముఖ్యనేతల సమావేశం జరిగింది, దీనిలో బాబు కొన్ని కీలక విషయాలు చెప్పాడు.

ఏపీలో కొత్త కరోనా వేరియంట్ ఎన్ 440 వేగంగా వ్యాపిస్తున్నది. ఇది ఇతర వైరస్ల కన్నా 10 రెట్లు అధిక ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. దీన్ని సిసిఎంబీ శాస్త్రవేత్తలు తొలిగా కర్నూలులో కనుగొన్నారని. ఇప్పటికే ఏపీలో 30 శాతం వ్యాప్తి చెందింది. బెడ్ ల కొరత ఉందని ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ అంగీకరించారు.

వ్యాక్సినేషన్ కొరత, ఆక్సిజన్ కొరతతో ఇది విపత్తుగా మారుతోంది. ఇది మరింత తీవ్రస్థాయికి చేరడాన్ని అరికట్టాలంటే ఏపీలో లాక్ డౌన్ కు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. ఇప్పటికే ఒరిస్సా రాష్ట్రం 14 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. ఇతర రాష్ట్రాలు ఇప్పటికే వ్యాక్సినేషన్ కొరకు పెద్ద ఎత్తున ఆర్డర్లు పెట్టాయి. ఏపీ కూడా వెంటనే ఆర్డర్లు పెట్టాలంటూ బాబు డిమాండ్ చేశాడు.

ఇప్పటివరకు కరోనా సెకండ్ వేవ్ ను చూసే భయపడిపోతున్న జనాలు కొత్త కరోనా వేరియంట్ గురించి చంద్రబాబు చెప్పటమే కాకుండా ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 30 శాతం పైగా వ్యాపించిందని చెప్పటంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఆ వైరస్ గురించి సెర్చ్ చేయటం మొదలుపెట్టారు. నిజానికి ఆ వేరియంట్ ఎన్ 440k అనేది ఈ ఏడాది జనవరిలోనే ఇండియా లో ఎంటర్ అయ్యిందని, ఫిబ్రవరిలో సౌత్ స్టేట్స్ లో బాగా వ్యాపించిందని గతంలో కొన్ని రిపోర్ట్స్ వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు మరోసారి చంద్రబాబు నాయుడు వేరియంట్ ఎన్ 440k గురించి చెప్పటంతో దాని గురించి చర్చ మొదలైంది.

Advertisement