Nara Lokesh : జనవరి 27.. లోకేశ్ పాదయాత్ర అధికారిక ప్రకటన
NQ Staff - November 25, 2022 / 03:21 PM IST

Nara Lokesh : తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నారు అనే విషయం గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇప్పటి వరకు తెలుగు దేశం పార్టీ కానీ.. లోకేష్ కి సంబంధించిన వారు కానీ అధికారికంగా ఆ విషయాన్ని ప్రకటించ లేదు. కానీ తాజాగా నారా లోకేష్ వైపు నుండి ఆ విషయం క్లారిటీ వచ్చేసింది.
కార్యకర్తల సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ.. జనవరి 27వ తారీకు నుండి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు వేల కిలో మీటర్లు పాదయాత్ర చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. పాద యాత్రలో దాదాపు 400 రోజుల పాటు పాల్గొంటానని కూడా నారా లోకేష్ పేర్కొన్నాడు.
మంగళగిరి లో కూడా తన పాదయాత్ర ఉంటుందని తెలియజేసిన లోకేష్ తనను ఓడించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సీఎం జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు.
లోకేష్ అధికారికంగా పాదయాత్ర ప్రకటన చేయడంతో పార్టీ నాయకులు మరియు కార్యకర్తల్లో హర్షం వ్యక్తం అవుతుంది. లోకేష్ పాదయాత్ర కచ్చితంగా తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తీసుకొస్తుందని వారు ధీమాతో ఉన్నారు.