Nara Lokesh: తల్లి తండ్రి, అత్తమామ ఆశీర్వాదం తీసుకుని బయలుదేరిన లోకేష్
NQ Staff - January 25, 2023 / 04:21 PM IST

Nara Lokesh : తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 27వ తారీకు నుండి యువగళం పేరుతో పాద యాత్రను ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా కుప్పం నుండి ప్రారంభం కాబోతున్న ఈ పాదయాత్ర కోసం నేడు హైదరాబాద్ నుండి లోకేష్ బయలుదేరాడు.
ముందుగా జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో తల్లిదండ్రులు చంద్రబాబు నాయుడు భువనేశ్వరి మరియు అత్తమామలు బాలకృష్ణ వసుంధర ల పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకున్న లోకేష్ ఆ తర్వాత తాత ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.

Nara Lokesh Going Start Pada Yatra Named Yuvagalam From January 27
అక్కడ నుండి కుప్పం బయలుదేరబోతున్నారు. 400 రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్ల దూరం లోకేష్ నడవబోతున్నారు. ఈ పాద యాత్రతో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు లోకేష్ తీవ్రంగా ప్రయత్నించబోతున్నారు.

Nara Lokesh Going Start Pada Yatra Named Yuvagalam From January 27
లోకేష్ వెంట వందలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నడిచేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం అయ్యింది. ఏపీ పోలీసులు ఇటీవలే అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. పాద యాత్ర జరిగే అన్ని రోజులు కూడా ఆయన వెంట పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు పెద్ద ఎత్తున ఉండబోతున్నారు. నందమూరి హీరోలు మధ్యలో ఆయనతో కలిసి నటిస్తారనే వార్తలు వస్తున్నాయి.