Nara Lekesh : బాంబు పేల్చిన లోకేష్ : జగన్ కుంభకోణాన్ని బయటపెడ్తారట.!
NQ Staff - August 16, 2022 / 10:50 PM IST

Nara Lekesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ‘జగన్‌వి డిగ్రీ ఫెయిల్ తెలివితేటలు’ అంటూ ఎద్దేవా చేశారు నారా లోకేష్. ‘టెన్త్ పాస్, డిగ్రీ ఫెయిల్ తెలివితేటలతో వైఎస్ జగన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు’ అని అన్నారు నారా లోకేష్.

Nara Lekesh comments on CM YS Jagan
2019 ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో అయితే నారా లోకేష్ పోటీ చేసి ఓడిపోయారో, అదే మంగళగిరి నియోజకవర్గంపై ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టినట్లున్నారు. ‘అందరికీ ఆరోగ్యమస్తు – ఇంటికి శుభమస్తు’ నినాదంతో సొంత ఖర్చుతో నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో ఉచిత వైద్య కేంద్రాన్ని ప్రారంభించారు.
లోకేష్ పేల్చిన బాంబు ఏంటంటే..
‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించి అతి పెద్ద కుంభకోణాన్ని వారం రోజుల్లో బయటపెడతా..’ అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు. ఇంతకీ, నారా లోకేష్ పేల్చబోయే బాంబు ఏంటి.? ఆ పెద్ద కుంభకోణం ఏంటి.?
ఏమోగానీ, నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలిప్పుడు వైసీపీలోనూ కలకలం రేపుతున్నాయి. నారా లోకేష్ దగ్గర నిజంగానే అంత పెద్ద కుంభకోణానికి సంబంధించిన ఆధారాలున్నాయా.? లేదంటే, షరామామూలుగానే నారా లోకేష్ ‘పప్పు’ రాజకీయం చేస్తారా.? అన్న చర్చ కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
కాగా, నారా లోకేష్ బయటపెట్టబోయేది అమరావతికి సంబంధించిన కుంభకోణం అయి వుంటుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.