Nara Chandrababu Naidu : చంద్రబాబు ‘రిటైర్మెంట్’ ప్రకటనతో వైసీపీ ఫుల్ హ్యాపీ.!

NQ Staff - November 17, 2022 / 03:13 PM IST

Nara Chandrababu Naidu : చంద్రబాబు ‘రిటైర్మెంట్’ ప్రకటనతో వైసీపీ ఫుల్ హ్యాపీ.!

Nara Chandrababu Naidu : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు రాజకీయాల నుంచి దాదాపుగా రిటైర్మెంట్‌ని ప్రకటించేసినట్లేనని వైసీపీ భావిస్తోంది. ‘ఇవే నాకు చివరి ఎన్నికలు’ అని చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలతో టీడీపీ శ్రేణులు అయోమయంలో పడ్డాయి.

‘ఇన్నాళ్ళకు చంద్రబాబు ఒక్క నిజం చెప్పారు..’ అంటూ వైసీపీ మంత్రులు ఎద్దేవా చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించేశారనీ, ఇకపై ఆయన విశ్రాంతి తీసుకోవచ్చన్నది వైసీపీ వాదన.

2024 ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతేనే..

చంద్రబాబు రిటైర్మెంట్ ప్రకటన వెనుక అర్థాన్ని వివరించలేక టీడీపీ శ్రేణులు తలపట్టుకుంటున్నాయి. ‘2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తాం.. రాకపోతే అవే తనకు చివరి ఎన్నికలని చంద్రబాబు చెప్పారు. అలాగని ఆయన రాజకీయాలకు దూరమవరు.. టీడీపీ ఎప్పటికీ వుంటుంది.. లోకేష్ నేతృత్వంలో టీడీపీ సత్తా చాటుతుంది..’ అంటూ టీడీపీ నేతలు చెబుతున్నారు.

కాగా, 2024 ఎన్నికల్లో ఇంకోసారి గెలిస్తే, ముప్ఫయ్యేళ్ళపాటు అధికారం మనదే.. అంటున్నారు వైసీపీ అధినేత, ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఒకప్పుడు చంద్రబాబు కూడా అలాగే అనుకున్నారు. రాజశేఖర్ రెడ్డి సైతం అలాగే ఆలోచించారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us