Nandamuri Mokshagna : తన తండ్రిని విమర్శించిన వారిని కుక్కలు అంటూ మోక్షజ్ఞ ఫైర్ బ్రాండ్ వ్యాఖ్యలు
NQ Staff - September 27, 2022 / 06:12 PM IST

Nandamuri Mokshagna : ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం పై రగడ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ ప్రస్తుతం జగన్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో వైకాపా నేతలు రెచ్చిపోయి మరి ఆయన విమర్శిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ కి వెన్ను పోటు పొడిచిన విషయంలో చంద్రబాబు నాయుడుకి బాలకృష్ణ ప్రత్యక్షంగా మద్దతు తెలిపాడు అంటూ బాలకృష్ణ పై వైకాపా శ్రేణులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.
రకరకాలుగా వైకాపా వారు నందమూరి బాలకృష్ణ ని విమర్శిస్తున్న నేపథ్యంలో మొదటి సారి ఆయన వారసుడు నందమూరి మోక్షజ్ఞ సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
మోక్షజ్ఞ పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ లో బాలకృష్ణకు మద్దతుగా స్పందించాడు. గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో మొరుగుతున్న కుక్కలు మీరు.. ఏం చేసినా కూడా బాలయ్య వెంట్రుక కూడా పీకలేరు, అవసరం ఉన్నప్పుడు అందరూ ఆయన కాళ్ళ దగ్గరికి వస్తారు.. అవసరం తీరగానే కారు కూతలు కూస్తున్నారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మీ యొక్క కారు కూతలకు కాలమే సమాధానం చెబుతుంది అంటూ నందమూరి మోక్షజ్ఞ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరు మాత్రం ఈ ట్వీట్ నందమూరి మోక్షజ్ఞ ది అయి ఉండకపోవచ్చు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం తెలియాల్సి ఉంది.
?బాలయ్య మీద గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మొరుగుతున్నా కొన్ని కుక్కలకు.. మీరు ఎంత చేసిన బాలయ్య వెంట్రుక కూడా పీక్కోలేరు..
?అవసరం ఉన్నప్పుడు అందరూ ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చినవారే అవసరం తీరిపోయాక కారు కూతలు కూస్తే కాలమే సమాధానం చెప్తుంది ?#NandamuriBalakrishna #Balayya pic.twitter.com/hRgYQHdSBt— Nandamuri Mokshagna Teja (@Mokshagna_Offl) September 25, 2022