Nandamuri Family Once Again Insulted Junior NTR : తారక్ కు ఆహ్వానం అందలేదా.. చంద్రబాబు ఇంత ప్లాన్ చేశాడా..?
NQ Staff - August 28, 2023 / 12:30 PM IST

Nandamuri Family Once Again Insulted Junior NTR :
నందమూరి ఫ్యామిలీ అంతా ఒక దిక్కు.. జూనియర్ ఎన్టీఆర్ ఒక్కటే ఒక దిక్కు అనేది ఎప్పటి నుంచో ఊస్తూనే ఉన్నాం. ఇప్పటికే చాలా సార్లు జూనియర్ ఎన్టీఆర్ ను నందమూరి ఫ్యామిలీ అవమానించింది. కానీ ఏనాడూ కూడా జూనియర్ ఆ విషయాలపై మాట్లాడలేదు. అయినా సరే నందమూరి ఫ్యామిలీ మాత్రం ఎప్పటికప్పుడు తారక్ ను పక్కన పెట్టేస్తూ.. ఎన్టీఆర్ కు తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పకనే చెబుతున్నాయి. మొన్న శతజయంతి ఉత్సవాల సందర్భంగా కూడా ఎన్టీఆర్ ను ఏదో నామమాత్రంగా ఆహ్వానించారు. అది కూడా నందమూరి ఫ్యామిలీ ఆహ్వానించలేదు.
టీడీపీ ఆధ్వర్యంలో చేసిన ఆ వేడుకకు వేడుక కమిటీ ఏదో అలా చెప్పింది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ కూడా తన పుట్టిన రోజు వేడుకను అడ్డు పెట్టుకుని దానికి హాజరు కాలేదు. ఇక తాజాగా ఎన్టీఆర్ నాణెంను రాష్ట్రపతి విడుదల చేస్తున్నారు. కానీ దీనికి కూడా ఎన్టీఆర్ హాజరు కావట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన్ను ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఇది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కాదు. పురంధేశ్వరి తన సొంత ఖర్చులతో చేస్తున్న కార్యక్రమం. ఆమె కోరిక మేరకే ఆర్బీఐ ఎన్టీఆర్ బొమ్మతో నాణెం ముద్రించింది. ఆ నాణెంను నేడు విడుదల చేస్తున్నారు.
కాగా పురంధేశ్వరి ఆహ్వానించిన వారు మాత్రమే ఈ కార్యక్రమానికి వెళ్తున్నారు. అయితే ఇప్పుడే జూనియర్ ఎన్టీఆర్ వెళ్లట్లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఆయనకు ఆహ్వానం అందలేదంట. పురంధేశ్వరి కావాలనే జూనియర్ ను దూరం పెట్టేసిందని తెలుస్తోంది. నందమూరి ఫ్యామిలీ నిర్ణయం మేరకే తారక్ కు ఆహ్వానం ఇవ్వలేదని సమాచారం. ఈ వేడుకకు నందమూరి ఫ్యామిలీ మొత్తం వెళ్తోంది. దాంతో మరోసారి ఎన్టీఆర్ కు నందమూరి ఫ్యామిలీకి మధ్య లుకలుకలు బయట పడ్డట్టు అయింది.

Nandamuri Family Once Again Insulted Junior NTR
ఎన్టీఆర్ ను మొదటి నుంచి ఇలాగే పక్కన పెట్టేస్తోంది. నందమూరి ఫ్యామిలీ. ఎన్టీఆర్ ను కలుపుకుని పోవొద్దని అటు నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ ఆదేశించినట్టు తెలుస్తోంది. వారిద్దరి నిర్ణయం మేరకే నందమూరి ఫ్యామిలీ తారక్ ను పక్కన పెట్టేస్తోంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ వస్తే టీడీపీ పార్టీలో తమ గ్రాఫ్ పడిపోతుందని వారి భయం. ఇప్పటికే టీడీపీ కార్యకర్తలు చాలామంది ఎన్టీఆర్ కు పగ్గాలు ఇవ్వాలని డిమాండ్లు చేస్తున్నారు.
చంద్రబాబు, లోకేష్ లను ఇప్పటికే టీడీపీ కార్యకర్తలు పక్కన పెట్టేస్తున్నారు. వారి ప్రోగ్రామ్ లలో జూనియర్ ఎన్టీఆర్ సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తున్న ఘటనలు కూడా బయట పడుతున్నాయి. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ను నందమూరి ఫ్యామిలీ అక్కున చేర్చుకుంటే తమను ఎవరూ పట్టించుకోరన్నది చంద్రబాబు, లోకేష్ లకు తెలుసు. అందుకే వారిద్దరూ ఇలా తారక్ ను నందమూరి ఫ్యామిలీకి దూరం చేస్తున్నారని సమాచారం.