Nagababu : రోజా నోరు మునిసిపాలిటీ కుప్ప తొట్టి: నాగబాబు సంచలన విమర్శలు.!

NQ Staff - January 7, 2023 / 11:13 AM IST

Nagababu : రోజా నోరు మునిసిపాలిటీ కుప్ప తొట్టి: నాగబాబు సంచలన విమర్శలు.!

Nagababu : జనసేన నేత, సినీ నటుడు, నిర్మాత నాగబాబు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాపై సంచలన విమర్శలు చేశారు. ‘రోజా నోరు మునిసిపాలిటీ కుప్ప తొట్టి.. దాన్ని కదిలించడానికి ఎవరూ ఇష్టపడరు..’ అంటూ నాగబాబు మండిపడ్డారు.

‘జనసేన మీదా, పవన్ కళ్యాణ్ మీదా.. చివరికి రాజకీయాల్లో లేని చిరంజీవి మీదా అనవసరమైన విమర్శలు చేస్తున్నావు..’ అంటూ రోజాపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు నాగబాబు. ఈ మేరకు నాగబాబు ట్విట్టర్‌లో ఓ వీడియో విడుదల చేశారు.

పర్యాటక మంత్రి అంటే పర్యటనలు చేయడం కాదు..

‘పర్యాటక మంత్రి అంటే నువ్వు పర్యటనలు చేయడం కాదు.. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలి.. నీ హయాంలో పర్యాటక శాఖ 18వ స్థానం నుంచి 20వ స్థానానికి పడిపోవడం ఖాయం..’ అంటూ నాగబాబు ఎద్దేవా చేశారు.

‘నీ మీద విమర్శలు చేయలేక కాదు. ఇన్నాళ్ళూ సహనంతో వున్నది, నీ నోరు ఓ మునిసిపాలిటీ కుప్ప తొట్టి అనే. దాన్ని కదిలించడానికి ఎవరూ సిద్ధపడరు..’ అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మరి, నాగబాబు విమర్శలపై వైసీపీ నేత, మంత్రి రోజా ఎలా కౌంటర్ ఎటాక్ ఇస్తారో వేచి చూడాల్సిందే.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us