ఇలాంటి అద్భుతం ఎప్పుడు చూసి ఉండ‌రు .. రంగులు మారుతోన్న శివలింగం

పంచారామ క్షేత్రాల్లో విశిష్టమైన క్షేత్రం సోమారామంలో అద్భుతం చోటు చేసుకుంది. సోమేశ్వర స్వామి తన అద్భుతాన్ని భక్తులకు చూపిస్తున్నారు. స్వామివారి లింగం రంగులు మారుతోంది. లింగం తెలుపు, గోధుమ రంగులోకి మారటాన్ని భక్తులు ఆశ్చర్యంగా తిలకించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి అతి సమీపంలో ఉన్న గునుపూడి అనే గ్రామంలో ఉన్న శివక్షేత్రమే సోమారామం. ఇక్కడి శివలింగం చంద్రుని చేత ప్రతిష్టింపబడిందని, కాబట్టి, ఈ క్షేత్రానికి సోమారామం అన్న పేరు వచ్చిందని పండితులు చెబుతున్నారు. పేరుకి తగినట్లుగానే చంద్రుని కళలతో పాటుగా పౌర్ణమి, అమావాస్యలకు మధ్య ఇక్కడి శివలింగం రకరకాల రంగులలో మారడాన్ని భక్తులు ఓ అద్భుతంగా భావిస్తారు.

అమావాస్యకు, పౌర్ణమికి లింగంలో రంగుల మార్పులు స్పష్టంగా కనిపిస్తాయని అర్చకులు చెబుతున్నారు. చంద్రుడు ప్రతిష్టించిన స్వామిని దర్శించుకుంటే వెన్నెల వలె మనసుకు ప్రశాంతత కలిగి, కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ స్వామివారి శిరస్సుపై భాగంలో అన్నపూర్ణమ్మ కొలువై ఉండడం మరో విశేషం. కార్తీక సోమవారం కావడంతో స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు అర్చకులు. మాస్క్‌ ఉన్నవారిని మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు ఆలయ అధికారులు.

భక్త జనకోటి మనసుల్లో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే సుప్రసిద్ధ పంచారామ దైవ క్షేత్రాలలో ‘సోమారామం’ ఒకటి. ఈ ఆలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అని కూడా అంటారు. తూర్పు గోదావరి జిల్లా … భీమవరం సమీపంలోని ‘గుణిపూడి’ గ్రామంలో ఈ క్షేత్రం ఉంది. భక్త సులభుడైన శివుడు ఇక్కడ ‘సోమేశ్వరస్వామి’ పేరుతో నిత్య పూజలందుకుంటూ ఉంటాడు.ఈ టెంపుల్ రెండు అంతస్తులుగా ఉంటుంది. కింది అంతస్తులో సోమేశ్వరుడు, పై అంతస్తులో అన్నపూర్ణాదేవి ఉంటారు. ఇలా శివుడి పైన అమ్మవారు ఉండటం దేశంలో మరెక్కడా లేదని వేద పండితులు చెబతూ ఉంటారు. క్షేత్రంలోని ‘చంద్ర పుష్కరిణి’ లో స్నానం చేస్తే పాపాలు మటుమాయమవుతాయని భక్తులు విశ్వసిస్తూ వుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here