Raghurama: రఘురామా.. ఇంకేమి సేతు?.. ఆర్మీ ఆస్పత్రిపైనే ఆరోపణలా?..

Raghurama: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఆయన తాజాగా సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ రిజిస్ట్రార్ కేపీ రెడ్డిపైన కూడా ఆరోపణలు చేయటం సంచలనం రేపుతోంది. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు మూడు పేజీల లెటర్ రాశారు. రఘురామకృష్ణరాజు నిన్న శనివారం ఢిల్లీలో రాజ్ నాథ్ సింగ్ ని స్వయంగా కలిసి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఈ లేఖను అందజేశారు. తనను సైనిక ఆస్పత్రి నుంచి త్వరగా డిశ్చార్జ్ చేసేందుకు కేపీ రెడ్డి డాక్టర్లపై ఒత్తిడి తెచ్చారని కంప్లైంట్ చేశారు.

raghurama

ఆ ముగ్గురు.. సూత్రధారులు..

కేపీ రెడ్డితోపాటు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏఈవో ధర్మారెడ్డి, గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి కలిసి తనను ఏపీ సీఐడీకి అప్పగించేందుకు కుట్ర పన్నారని రఘురామ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు మారు వేషంలో ఆర్మీ హాస్పిటల్ లో మకాం వేసేందుకు కేపీ రెడ్డి కోపరేట్ చేశారని తెలిపారు. ఈ మేరకు 15 మంది పోలీసులు సైనిక ఆస్పత్రి క్యాంటీన్ లో భోజనం చేసిన బిల్లులను రఘురామ తన లేఖతోపాటు అందించారు. కేపీ రెడ్డిపై డిపార్ట్మెంటల్ చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారు.

raghurama

సుప్రీంకోర్టు బద్నాం..

ఏపీ సర్కారు కోరినట్లు గవర్నమెంట్ హాస్పిటల్ లో కాకుండా, రఘురామ న్యాయవాదులు అడిగినట్లు రమేష్ ఆస్పత్రిలో కాకుండా సుప్రీంకోర్టు ఆర్మీ హాస్పిటల్ ని రిఫర్ చేసింది. దీంతో రఘురామను సికింద్రాబాద్ సైనిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే బాధితుడు ఇప్పుడు అదే ఆర్మీ హాస్పిటల్ పై ఆరోపణలు చేస్తున్నాడంటే దేశ అత్యున్నత న్యాయస్థానం నమ్మకాన్నే వమ్ము చేస్తున్నట్లు భావించొచ్చు. తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ కూడా అయిన కేపీ రెడ్డి ఏపీ ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గినట్లు రఘురామ పరోక్షంగా ఆరోపించాడు. అంటే న్యాయ వ్యవస్థలో పనిచేసేవాళ్లు సైతం కుట్రలు, కుతంత్రాలు చేస్తారంటూ డైరెక్టుగానే ఆరోపించాడు. నిజంగా కేపీ రెడ్డే ఈ ప్లాన్ వేసుంటే ఆయనకి తెలియకుండా రఘురామ ఢిల్లీకి ఎలా వెళ్లేవాడనే ప్రశ్న తలెత్తుతోంది. కేపీ రెడ్డి ఆర్మీ హాస్పిటల్ డాక్టర్లపై ఒత్తిడి చేసుంటే రఘురామ డిశ్చార్జ్ అవుతున్న విషయం ఏపీ పోలీసులకి తెలియకుండా ఉంటుందా?. తెలిసినా వాళ్లెందుకు ఎంపీని మళ్లీ అరెస్టు చేయలేదు?.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు రఘురామ సమాధానం చెప్పాల్సి ఉంది.

raghurama