Raghurama: రఘురామా.. ఎందుకు నీకీ ఖర్మ?..

Raghurama: గతంలో ఎంతో ఘనత వహించిన నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణ రాజును వీల్ చైర్ లో చూస్తుంటే గుండె తరుక్కు పోతోంది. నిన్న శనివారం ఆయన దేశ రాజధాని ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని కలవటానికి చక్రాల కుర్చీలోనే కారు దాకా వెళ్లి అందులోకి అతి కష్టమ్మీద ఎక్కటాన్ని గమనించిన ఎవరికైనా చాలా బాధనిపిస్తుంది. ‘ఊపిరి’ సినిమాలోని నాగార్జున గుర్తుకు రాకపోడు. ఎంత గొప్పగా బతికినవాడు.. ఇప్పుడెందుకు ఇలా అయిపోయాడు.. అని ప్రతిఒక్కరూ ఫీలౌతారు. కానీ ఏం చేస్తాం?. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారనే సామెత గుర్తొచ్చి మనసుకు సమాధానం చెప్పుకున్నాం.

Raghurama

ఫిర్యాదుల మీద ఫిర్యాదులు..

ఏపీ ప్రభుత్వం తనపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తోందని రఘురామకృష్ణరాజు రాజ్ నాథ్ సింగ్ కి ఫిర్యాదు చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలకి కూడా లెటర్లు రాసినట్లు తెలుస్తోంది. అంతేకాదు. ఏపీ సీబీసీఐడీ ఆఫీసర్లు తనను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న సందర్భంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి సైతం కంప్లైంట్ చేశారు. వాళ్లిద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు రఘురామ చాంతాడంత లేఖ రాశారు.

Raghurama

అంత అవసరమా?..

రఘురామకృష్ణరాజు కొద్దిరోజుల పాటు కదలటానికి వీల్లేదని, పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని ఎయిమ్స్ డాక్టర్లు సలహాలు, సూచనలు ఇచ్చారు. అయినా వాటిని లెక్క చేయకుండా ఆయన రాజ్ నాథ్ సింగ్ ఇంటికి వెళ్లి వచ్చారు. ఇప్పటికే లోక్ సభ స్పీకర్ కి రఘురామ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో పిటిషన్లు వేశారు. వాటిపై తీర్పులు వెలువడాల్సి ఉంది. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే న్యాయ స్థానాలు అస్సలు ఊరుకోవు. అలాంటప్పుడు రఘురామ ఇలా ప్రతిఒక్కరికీ ఫిర్యాదు చేయటం అవసరమా అనే ప్రశ్న తలెత్తుతోంది. అయినా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నానా బూతులు తిడితే ప్రధాని, హోం మంత్రి, రక్షణ శాఖ మంత్రి సైతం వెనకేసుకొస్తారా?. ప్రజాప్రతినిధి అన్న తర్వాత కాస్త పద్ధతిగా నడుచుకోవాలని హితవు పలుకుతారే తప్ప సపోర్ట్ చేయకపోవచ్చని సమాచారం.