MP Raghurama Krishnam Raju : ఎమ్మెల్యే ను రెండు రోజుల క్రితం తాడేపల్లి పిలిపించి కొట్టాడు : ఎంపీ రఘురామ రాజు

MP Raghurama Krishnam Raju : వైసీపీ రెబ‌ల్ ఎమ్మేల్యే ర‌ఘురామ రాజు ఇటీవ‌లి కాలంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి చుక్క‌లు చూపిస్తున్నాడు. ఆయ‌న చేసే సంచ‌ల‌న కామెంట్స్ ఏపీ ప్ర‌భుత్వంకి కాస్త ఇబ్బందిగానే మారుతున్న‌ట్టు క‌నిపిస్తుంది. వైసీపీకి దూరంగా ఉంటున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణమ రాజు రాజీనామాకు రెడీ అవుతున్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలుస్తానని ఆయన రీసెంట్‌గా సవాల్‌ విసిరారు.

MP Raghurama Krishnam Raju comments on YSRCP and cm ys jagan
MP Raghurama Krishnam Raju comments on YSRCP and cm ys jagan

వైసీపీకి దూరంగా ఉంటూ… తరచూ వైసీపీ అధిష్టానం తీరుపై విరుచుకపడుతున్నారు ర‌ఘురామ‌. దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్న ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఇప్పటికే స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో తనపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద రఘురామపై స్పీకర్ అనర్హత వేటు వేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

స్పీకర్ యాక్షన్‌ తీసుకుంటారని తెలిసి… రఘరామకృష్ణమరాజు తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్లు స్వయంగా ఆయన మీడియాకు వెల్లడించారు. తనను పార్లమెంట్ సభ్యుడిగా డిస్‌క్వాలిఫై చేయలేరని చెప్పారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అరాచకాలు, అక్రమాలుపై రఘురామ ధ్వజమెత్తారు. ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయుడి ఆత్మహత్య ప్రభుత్వ హత్యే అన్నారు. మీడియా సంస్థలు పత్రికలను బ్యాన్ చేశామని తమ పార్టీ నేతలు ప్రకటించడం సిగ్గుచేటన్నారు.

తాజాగా ఆయ‌న సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాకి చెందిన,ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన, ఎమ్మెల్యే ను రెండు రోజుల క్రితం తాడేపల్లి పిలిపించి కొట్టాడు. ఎవరు కొట్టారు ఎవరిని కొట్టారూ నేను చెప్పను అంటూ ర‌ఘురామ కృష్ణంరాజు కామెంట్ చేశారు.

ర‌ఘురామ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. కాగా, ర‌ఘురామ త్వరలోనే బీజేపీ తీర్థంపుచ్చుకోనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ అభ్యర్థిగానే ఆయన నరసాపురం నుంచి ఎన్నికల బరిలో నిలిచే అవకాశముందన్న టాక్ వినిపిస్తోంది.