Kesineni Nani : తెలుగుదేశం పార్టీలో కేశినేని రగడ చల్లారినట్టేనా.?

NQ Staff - August 1, 2022 / 08:31 AM IST

Kesineni Nani : తెలుగుదేశం పార్టీలో కేశినేని రగడ చల్లారినట్టేనా.?

Kesineni Nani : తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడితో సర్దుకుపోయినట్లేనా.? కేశినేని నాని కుమార్తె నిశ్చితార్థ వేడుకలో చంద్రబాబు సహా, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొనడం, అందర్నీ సాదరంగా కేశినేని నాని ఆహ్వానించడం, ఈ క్రమంలో చంద్రబాబు – నాని మధ్య సరద సంభాషణలు సాగడంతో, ఇరువురి మధ్యా వివాదం చల్లారినట్లేనని భావించాలేమో.

MP Kesineni Nani vs Kesineni Chinni in TDP

MP Kesineni Nani vs Kesineni Chinni in TDP

కాగా, కేశినేని నానికీ చంద్రబాబుకీ మధ్య స్వయానా కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్ని చిచ్చుపెడుతున్నారు. కేశినేని నాని కంటే చిన్నికి చంద్రబాబు రాజకీయంగా ప్రాధాన్యతనిస్తున్నారన్న ప్రచారమైతే బాగా సాగుతోంది. చిన్ని కూడా, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఆదేశిస్తే విజయవాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానంటున్నారు.

చిన్ని వర్సెస్ నాని.. కేశినేని కుటుంబ యుద్ధం.!

కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. అయితే, ఆ ఎన్నికల్లో గెలవాల్సిన టీడీపీ, అనూహ్యంగా చతికిలపడింది. దానికి కారణం కేశినేని చిన్ని సహా బుద్ధా వెంకన్న తదితరులని కేశినేని నాని అనుమానిస్తున్నారు.

ఈ క్రమంలో పార్టీతో కేశినేని నాని అంటీముట్టనట్లు వ్యవహరిస్తూ వచ్చారు. అయితే, ఇటీవల నాని – చంద్రబాబు మధ్య భేటీ జరిగిందనీ, దాంతో వివాదం సమసిపోయిందనీ అంటున్నారు. కేశినేని చిన్ని మాత్రం, అన్నతో తనకు చాలాకాలంగా విభేదాలున్నాయనీ, టీడీపీలో తన దారి తనదేనని అంటున్నారు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us