Mohan Babu : అన్నయ్య ఎన్టీయార్ మీద రాద్ధాంతం జరుగుతోంటే, తమ్ముడు మోహన్‌బాబు ఏం చేస్తున్నట్టు.?

NQ Staff - September 27, 2022 / 06:24 PM IST

Mohan Babu : అన్నయ్య ఎన్టీయార్ మీద రాద్ధాంతం జరుగుతోంటే, తమ్ముడు మోహన్‌బాబు ఏం చేస్తున్నట్టు.?

Mohan Babu : ‘అన్నయ్య నందమూరి తారక రామారావు అంటే నాకెంతో అభిమానం. ఆయన గొప్ప మనిషి. మహా నటుడు..’ ఇలా చెబుతుంటారు సినీ నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు. కానీ, ఇప్పుడాయన జాడ కనిపించడంలేదు. స్వర్గీయ నందమూరి తారకరామారావు పేరు చుట్టూ నానా విధాలుగా రాజకీయ యాగీ జరుగుతోంది.

ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చింది ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ ప్రభుత్వం. అంతేనా, మంత్రి దాడిశెట్టి రాజా అయితే స్వర్గీయ ఎన్టీయార్‌ని అసమర్థ రాజకీయ నాయకుడిగా అభివర్ణిస్తున్నారు.

మోహన్‌బాబు స్పందించరేం.?

ఇంత జరుగుతున్నా, తమ్ముడు మోహన్‌బాబు ఎందుకు స్పందించడంలేదన్న చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. ఆ మహానుభావుడు.. అని తన అవసరార్ధం స్వర్గీయ ఎన్టీయార్‌ని ఆకాశానికెత్తేస్తుంటారు మోహన్‌బాబు. వెన్నుపోటు రాజకీయాల గురించీ.. ఇతరత్రా వ్యవహారాల గురించీ మోహన్‌బాబు మాట్లాటడటం కొత్త కాదు.

‘అన్నయ్య పిలవడం వల్లనే రాజకీయాల్లోకి వెళ్ళాను..’ అని కూడా మోహన్‌బాబు పలు సందర్భాల్లో చెప్పారు. అన్నయ్య పేరు వాడుకోవడమే తప్ప, ఆ అన్నయ్యని వివాదాల్లోకి లాగుతున్నప్పుడు మాత్రం తమ్ముడు మోహన్‌బాబు స్పందించరన్నమాట.

2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేసిన మోహన్‌బాబు ఆ తర్వాత ఆ పార్టీకి దూరంగా వుంటూ వస్తున్నారు. అయినా, వైఎస్ జగన్ కుటుంబంతో బంధుత్వముంది మోహన్‌బాబు కుటుంబానికి. బహుశా, అందుకే భయపడుతున్నారేమో కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు.

Read Today's Latest Andhra pradesh in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us