Modi-Jagan : మోడీ సర్కార్ కన్నా జగన్ గవర్నమెంటే ఫాస్ట్

Modi-Jagan : కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల్ని ఆదుకునే విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కన్నా ఏపీలోని జగన్ సర్కారే వేగంగా స్పందించింది. కొవిడ్ వల్ల అనాథలైన చిన్నారుల పేరిట రూ.10 లక్షలను డిపాజిట్ చేసే పథకానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం పది రోజుల కిందటే శ్రీకారం చుట్టగా సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ శనివారం ప్రారంభించింది. 18 ఏళ్ల లోపు వారికి ఈ స్కీమ్ వర్తిస్తుందని ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేయగా మోడీ ప్రభుత్వం మాత్రం 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ రూ.10 లక్షల కార్పస్ ఫండ్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

Modi-Jagan : jagan governament taking decisions very fast
Modi-Jagan : jagan governament taking decisions very fast

ఏది బెస్ట్?..

ఏపీ గవర్నమెంట్ పథకమే కాస్త బాగున్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్ చేయనున్న డబ్బులకు నెల నెలా వచ్చే వడ్డీని బాధితులు విత్ డ్రా చేసుకునేలా జగన్ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. దీనివల్ల ఆ చిన్నారులకు ఆర్థికంగా చేయూత లభిస్తుంది. వాళ్లను పెంచి పెద్ద చేయటానికి ఎవరైనా తేలిగ్గా ముందుకు వచ్చే అవకాశం ఉంది. కానీ మోడీ సర్కార్ మాత్రం బాధితులకు 23 ఏళ్ల వయసు వచ్చాక పర్సనల్, కెరీర్ అవసరాల కోసం కార్పస్ ఫండ్ మొత్తం ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించింది. అప్పటివరకు ఆ అనాథల గురించి ఎవరు పట్టించుకోవాలనే ప్రశ్నకు అస్పష్టమైన వివరణ ఇచ్చింది.

నెల నెలా స్టైఫండ్ : Modi-Jagan

పేరెంట్స్ ని కోల్పోయిన పిల్లలకు ఉచితంగా విద్యనందించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ ని ఎప్పటివరకు, ఎలా అందిస్తారనేది తెలియట్లేదు. వాళ్ల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుచేస్తారా? లేక ఇప్పటికే గురుకుల పాఠశాలల్లో కొన్ని సీట్లను రిజర్వ్ చేస్తారా అనే విషయంలో క్లారిటీ లేదు. అదే సమయంలో ఉన్నత విద్యా కాలంలో వారి అవసరాల కోసం నెల వారీ స్టైఫెండ్ ఇవ్వాలనుకుంటోంది. ఏదేమైనా ఉత్తర్వులు విడుదలైతే గానీ స్పష్టత రాదు. మొత్తానికి అనాథ పిల్లలను ఆదుకునే విషయంలో జగనే ముందుగా క్రెడిట్ కొట్టేశాడు. ఆయన్ని పలు రాష్ట్రాలు అనుసరించటం విశేషం. కేరళ రూ.3 లక్షలు, తమిళనాడు రూ.5 లక్షలు, ఢిల్లీ ప్రతి నెలా (పాతికేళ్ల వయసు వచ్చే వరకు) రూ.2,500లతోపాటు ఉచిత విద్య అందించనున్నట్లు ప్రకటించాయి.