Balakrishna: బాలకృష్ణ వాచ్‌మెన్‌ని ఎవరు చంపేశారో పవన్ కళ్యాణ్ ప్రశ్నించవచ్చు.. వంశీ సంచ‌ల‌న కామెంట్స్

Balakrishna ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు హీటెక్కిపోతున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు ప‌వ‌న్ క‌ళ్యాన్‌.. వైసీపీ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ‌గా, ఇప్ప‌టికీ ఆయ‌న‌పై ఎదురు దాడి కొన‌సాగుతూనే ఉంది. మ‌రోవైపు టీడీపీ- వైసీపీ మ‌ధ్య దారుణ‌మైన వార్ న‌డుస్తుంది. ఈ క్ర‌మంలో ఏపీ రాజ‌కీయాల‌పై దారుణ‌మైన కామెంట్స్ చేస్తున్నారు.

గన్నవరం టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా పవన్ కళ్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంలో హిందూపురం ఎమ్మెల్యే, నట సింహం నందమూరి బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల ఘటనను తెరపైకి తీసుకుని వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వల్లభనేని వంశీ.రెండు లక్షల పుస్తకాలు చదివిన వ్యక్తి ఖచ్చితంగా ప్రశ్నించాలి.

మనిషి జీవితంలో సాధారణ జీవితంలో 20-25 వేల రోజులు కూడా ఉండవు. ఈ లెక్కన చూసుకుంటే.. రోజుకి 10 పుస్తకాలు చదవాలి. ఫుల్ టైం బతికిన వ్యక్తి రోజుకి 10 పుస్తకాలు చదివితే 2 లక్షల పుస్తకాలు చదవొచ్చు. లేదంటే రజనీకాంత్ రోబో సినిమాలో లాగ.. పుస్తకాలు పట పటా చదివేస్తే పవన్ కళ్యాణ్ 2 లక్షల పుస్తకాలు చదివి ఉండొచ్చు.

2 లక్షల పుస్తకాలు చదివిన సూక్ష్మ సత్యాగ్రహి, అత్యంత తెలివైన వాడు కాబట్టి అన్ని విషయాలు తెలిసే ఉంటాయి. పింగళి దశరథ రామయ్య తెలిసే ఉంటుంది.. ఎన్ కౌంటర్ పత్రిక ఎడిటర్.. ఆయన ఎలా చనిపోయాడా పవన్ కళ్యాణ్ ఎంక్వరీ చేపించవచ్చు.అలాగే మల్లెల బాబ్జీ అని ఒకడు ఉండేవాడు.. ఎన్టీ రామారావు మీద హత్యా ప్రయత్నం చేశాడు.. ఆయన ఎలా చచ్చిపోయాడో కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించవచ్చు.

నందమూరి బాలకృష్ణ గారి ఇంట్లో బెల్లంకొండ సురేష్‌ని సత్యనారాయణ చౌదరిని కూడా ఎవరు కాల్చారో కూడా పవన్ కళ్యాణ్ సీబీఐ ఎంక్వరీ ద్వారా అడగొచ్చు. అలాగే నందమూరి బాలకృష్ణ గారి ఇంటి వాచ్‌మెన్‌ని ఎవరు చంపేశారని కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించవచ్చు. ఎందుకంటే ఇవన్నీ పవన్ కళ్యాణ్ చదివిన పుస్తకాల్లో తప్పకుండా ఉండి ఉండొచ్చు.

కేవలం కోడికత్తి, వివేకానంద రెడ్డి హత్య కేసు ఇవే కాదు.. ప్రపంచంలో చాలా కేసులు ఉన్నాయి. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు రాత్రికి రాత్రి సూట్ కేసులు ఎవడు ఎత్తుకుని పోయాడు.. సైకిల్ ఎవడు ఎత్తుకునిపోయాడు. కుర్చీ ఎవడు ఎత్తుకుపోయాడు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ చదివే ఉండాలి.. ప‌వన్ కళ్యాణ్ ఇప్పటికే 2 లక్షలు పుస్తకాలు చదివాడు.. మరో నాలుగు లక్షల పుస్తకాలు చదివి ఇంకా చాలా ప్రశ్నించాలని కోరుతున్నా’ అంటూ సెటైర్లు వేశారు వల్లభనేని వంశీ.