MLA GANTA : ఫ్లాష్.. ఫ్లాష్.. : ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా

MLA GANTA : ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తొలి రాజకీయ రాజీనామా నమోదైంది. తెలుగు దేశం పార్టీ(టీడీపీ)కి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఆయనే కొద్దిసేపటి కిందట తన శాసన సభ్యత్వానికి రిజైన్ చేశారు. ఈ లేఖను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు పంపించారు.

సేవ్.. సేవ్..

వైజాగ్ ఉక్కు ఫ్యాక్టరీని రక్షించుకోవటానికే తాను ఈ పని చేశానని గంటా శ్రీనివాస రావు పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తానని ఆయన నిన్న శుక్రవారమే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా చెప్పి ఒక్క రోజు కూడా గడవక ముందే అందరికన్నా ముందుగా పదవిని వదులుకున్నారు. తద్వారా తాను మాటల మనిషిని కాదని, చేతల మనిషినని నిరూపించుకున్నారు. విశాఖ స్టీల్ కర్మాగారాన్ని కాపాడుకోవటానికి తాను రాజకీయేతర జేఏసీని ఏర్పాటు చేయబోతున్నట్లు కూడా తేల్చిచెప్పారు.

MLA GANTA : ganta srinivasarao resigned
MLA GANTA : ganta srinivasarao resigned

మళ్లీ తెర మీదికి: MLA GANTA

గంటా శ్రీనివాసరావు కొద్దికాలంగా పాలిటిక్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయట్లేదు. తెలుగుదేశం పార్టీ ప్రోగ్రామ్స్ నీ పట్టించుకోవట్లేదు. టీడీపీకి గుడ్ బై చెప్పి అధికార పార్టీలోకి రావాలని ప్రయత్నిస్తున్నారే వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఏకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి విశాఖ ఉక్కు కార్మికులకు నైతికంగా మరింత ధైర్యాన్నిచ్చారు. గంటా రాజీనామా ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. దీనిపై అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కానీ విశాఖ ఉక్కు కోసం మరిన్ని రాజీనామాలు చోటుచేసుకుంటాయనటంలో ఎలాంటి సందేహమూలేదు. స్థానిక ఎంపీ, వైఎస్సార్సీపీ నాయకుడు ఎంవీవీ సత్యనారాయణ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకోవటానికి వెనకాడబోనని నిన్న చెప్పారు.

Advertisement