జగన్ ఒకే ఒక్క మాట చెప్పాడు – వాళ్ళిద్దరూ కలిసిపోయారు : ఫుల్ హ్యాపీ !

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనేది జగమెరిగిన సత్యం. ఇప్పడు ఇది తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల నాయకుల వల్ల మల్లి మరొకసారి ప్రూవ్ అయ్యింది. తూర్పు గోదావరి జిల్లాలో ఈ మధ్య కాలంలో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మరియు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర శేఖర్ ల మధ్య ఒక్కసారిగా రాజకీయ తుఫాన్ వచ్చింది. వాస్తవానికి వీరిద్దరూ గురు శిష్యులు. కానీ ఇప్పుడు ఈ తుఫాన్ తగ్గిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయా విశ్లేషకులు.

ycp flag

తాజాగా ద్వారంపూడి చంద్రశేఖర్ ఇంటికి మంత్రి పిల్లి చంద్రబోస్ వెళ్లగా వీరిద్దరి మధ్య రాజీ కుదిరిన సంగతి బయటకు తెలిసింది. నిన్నటి వరకు ప్రెస్ మీట్లు పెట్టుకొని మరి తిట్టుకున్నా ఈ నాయకులు కలవడం వెనక వైస్ జగన్ హస్తం ఉంది అని వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్నారు. మంత్రి బోసు ద్వారంపూడి ఇంటికి వెళ్లిన సమయంలో చంద్రశేఖర్ బోస్ ని చాల ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని భోజన ఏర్పాట్లు చేశారట. రెండు రోజుల క్రితం DRC మీటింగ్ లో పేదల ఇళ్ల వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ దానికి కారణం సైతం ఎమ్మెల్యే అంటూ బోస్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పైగా ద్వారంపూడి నియోజకవర్గం నుండి వస్తున్న కంప్లైంట్స్ కి కారణం కూడా ఎమ్మెల్యే అంటూ పిల్లి విరుచుకపడ్డారు. దీంతో ఈ జిల్లాలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగింది. ఈ వ్యాఖ్యలపై ద్వారంపూడి సైతం అదే స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు ..నా కొడకా..అంటూ మంత్రి పై మాటల వర్షం కురిపించారు.

ఇక ఈ విషయంలో పంచాయితీ పెట్టి వైస్ జగన్ ఇద్దరికీ గట్టి వార్నింగ్ ఇచ్చారట. అంతే ఇక తెల్లారే సరికి ఇద్దరు నాయకులు ఒక్కటై పోయారు. అన్నదమ్ముల్లా కలిసి మెలసి ఉంటారని వైస్ జగన్ కి మాట ఇచ్చారట. ఏది ఏమైనా ఈ ఇద్దరు బడా రాజకీయ నాయకులు లొల్లి టీ కప్పులో తుఫాన్ లా చల్లారిపోయింది.

Advertisement