ABN Radhakrishna And Narayana Swamy : అమ్మకీ అబ్బకీ పుట్టుంటే.! ఏబీఎన్ ఆర్కేపై ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఫైర్.!

NQ Staff - August 1, 2022 / 07:34 PM IST

148268ABN Radhakrishna And  Narayana Swamy  : అమ్మకీ అబ్బకీ పుట్టుంటే.! ఏబీఎన్ ఆర్కేపై ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఫైర్.!

ABN Radhakrishna And Narayana Swamy  : రాజకీయాల్లో ఆరోపణలు సహజం. అయితే, మీడియానే ప్రతిపక్ష పాత్ర పోషించి మరీ నిందారోపణలు చేయడం అనేది ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ విషయంలో మరింత దిగజారిపోతోందన్నది ఇటీవలి కాలంలో తరచూ వింటున్నాం.
ఇక, అసలు విషయానికొస్తే.. మంత్రి నారాయణ స్వామి, ఏబీఎన్ రాధాకృష్ణపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘అమ్మకీ అబ్బకీ పుట్టి వుంటే..’ అంటూ సవాల్ విసిరారు.

మద్యం లైసెన్సులు.. బినామీలు..

Minister Narayana Swamy Harsh Comments On ABN Radhakrishna

Minister Narayana Swamy Harsh Comments On ABN Radhakrishna

మంత్రి నారాయణ స్వామి తన బినామీల ద్వారా నాలుగు బార్లకు సంబంధించి లైసెన్సుల్ని సొంతం చేసుకున్నారన్నది ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే మంత్రి నారాయణస్వామి అత్యంత తీవ్రంగా స్పందించారు.

‘నాకెవరూ బినామీలు లేరు. వున్నారని నిరూపిస్తే, దేనికైనా సిద్ధమే. అమ్మకీ అబ్బకీ పుట్టి వుంటే.. నా మీద ఆరోపణల్ని రుజువు చెయ్..’ అంటూ సవాల్ విసిరారు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి. అంతే కాదు, ‘ఆరోపణల్ని నిరూపించలేకపోతే, పరువు నష్టం దావాకి సిద్ధంగా వుండాలి..’ అంటూ హెచ్చరించారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.