West Godawari : పశ్చిమగోదావరి జిల్లాలో భారీ పేలుడు: నలుగురి మృతి.!

NQ Staff - November 10, 2022 / 10:05 PM IST

West Godawari : పశ్చిమగోదావరి జిల్లాలో భారీ పేలుడు: నలుగురి మృతి.!

West Godawari : పశ్చిమగోదావరి జిల్లాలో భారీ పేలుడు చోటు చేసుకుంది. బాణాసంచా తయారీ కర్మాగారంలో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

భారీ పేలుడుతో ఒక్కసారిగా తాడేపల్లిగూడెం మండలం కడియుద్దలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. దిక్కులు పిక్కటిల్లేలా శబ్దం వచ్చిందనీ, సుమారు పది కిలోమీటర్ల దూరం వరకు పేలుడు శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

కర్మాగారంలో పదిమంది..

కాగా, ఈ ఘటన జరిగిన సమయంలో సంఘటనా స్థలంలో 10 మంది వున్నట్లు తెలుస్తోంది. అందులో నలుగురు ప్రాణాలు కోల్పోగా ఒకర్ని రక్షించారు. మిగతా వ్యక్తుల ఆచూకీ తెలియాల్సి వుంది. పేలుడు తీవ్రత అధికంగా వుండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుంది.

అన్నవరం అనే వ్యక్తికి చెందిన బాణా సంచా కర్మాగారంలో ఈ పేలుడు జరిగిందని పోలీసులు చెబుతున్నారు. దీపావళి అనంతరం కూడా బాణా సంచా తయారీ జరుగుతుండడం, భారీ పేలుడు సంభవించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

బాణా సంచా తయారీ కేంద్రాలకు సంబంధించి కఠిన నిబంధనలున్నా, నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగిన దాఖలాలున్నాయి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us