తిరుపతి ఉప ఎన్నిక కోసం డిల్లీ నుంచి వస్తున్నాడు, చిన్నా చితకా లీడర్ కాదు !
Tech Desk-2 - January 1, 2021 / 06:58 PM IST

తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికల అనూహ్య ఫలితాల నేపథ్యంలో తిరుపతిలో కూడా అలాందిదే పునరావృతం అయ్యే అవకాశం ఉంది అంటూ రాజకీయ వర్గాల్లో కొందరు బలంగా నమ్ముతున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న వైకాపా పై కాస్త వ్యతిరేకత ఉంది. దాన్ని బీజేపీ మరియు తెలుగు దేశం పార్టీ ఎత్తి చూపించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో తిరుపతి ఉప ఎన్నిక ఖచ్చితంగా రసవత్తరంగా సాగే అవకాశం ఉందని అంతా నమ్మకంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో మాదిక సంఘం జాతీయ నాయుడిగా దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకున్న మంద కృష్ణ మాదిగ ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

manda krishna madiga in tirupati by elections
ఢిల్లీ స్థాయిలో మంద కృష్ణ మాదిగకు మంచి పేరు ఉంది. ఇలాంటి సమయంలో ఆయన ఈ ఎన్నికలో పోటీ చేయడం వల్ల ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాడు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మంద కృష్ణ మాదిగ పోటీ చేస్తే ఖచ్చితంగా దళితులు మరియు వెనుకబడిన వర్గాల వారి ఓట్లు చీలే అవకాశం ఉంది. అప్పుడు అది ఎవరికి లాభం చేకూర్చుతుంది అనేది చర్చనీయాశంగా మారింది. మంద కృష్ణ గెలవకపోయినా కూడా ఆయనకు గెలుపు ఓటములను నిర్ణయించే ఖఛ్చితమైన శక్తి ఉందంటూ ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. రాజకీయాల్లో క్రియాశీలకంగా మారాలని చాలా కాలంగా మందకృష్ణ భావిస్తున్నారు.

manda krishna madiga in tirupati by elections
తిరుపతి ఉప ఎన్నిక నుండి దాన్ని నిలబెట్టుకోవాలనే నిర్ణయానికి ఈయన వచ్చారట. ఈయన చిన్నా చితకా లీడర్ అనుకుంటే మాత్రం పప్పులో కాలు వేసినట్లే. వైకాపా మరియు బీజేపీ అందరు కూడా ఈయన్ను ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాలి. ఈయన అన్ని పార్టీల ఓట్లను చీల్చడంతో పాటు రాజకీయంగా పెను మార్పులు తీసుకు రాగల శక్తి ఉన్న నాయకుడు. అందుకే మంద కృష్ణ మాదిగా పోటీ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో పలు పార్టీలు వారి అభ్యర్థిని మార్చుకునే పనిలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.