Covid19: ముదురుతున్న కరోనా.. 60 రోజులు పాటు కరోనాతో పోరాడి గెలిచిన వైజాగ్ వాసి
Samsthi 2210 - July 31, 2021 / 12:28 PM IST

Covid19: కరోనా వైరస్ ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి వలన ఎందరో జీవితాలు నాశనం అయ్యాయి. ఇప్పటికీ కొందరి పరిస్థితి దారుణంగా మారింది. అయితే తొలి వేవ్‌లో కరోనా బారిన పడిన వారు 10 నుండి 15రోజులలో కోలుకోగా, సెకండ్ వేవ్‌లో రోజుల సంఖ్య పెరిగింది. 20 రోజుల తర్వాత నెగెవిట్ రిపోర్ట్ వచ్చింది.

Man Fight for 60 Days with Corona1
తాజాగా ఏపీలో ఓ వ్యక్తి కరోనా మహమ్మారి బారిన పడి 60 రోజుల పాటు హాస్పిటల్ లో కరోనా వైరస్ తో పోరాడి కోలుకున్నాడు. ఈ ఘటన విశాఖపట్నం లో చోటు చేసుకుంది. 60 రోజుల పాటు కరోనా మహమ్మారి తో పోరాడి కోలుకోవడం విశేషం. నరేష్ అనే రోగి ఊపిరితిత్తులు మార్పిడి ద్వారా కాపాడబడ్డారని కిమ్స్ ఆసుపత్రి వైద్యుడు పల్మోనాలజిస్ట్ ఫణీంద్ర గురువారం వెల్లడించారు
కరోనాతో వేరే ఆసుపత్రిలో చేరిన నరేష్‌కి ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి. దీంతో మే నెలలో కిమ్స్‌కి వెళ్లాడు. మొదట్లో అతనికి చాలా ఆక్సిజన్ అవసరం అయింది. నరేశ్ కు పల్మనరీ థ్రోంబోఎంబోలిజం ఉన్నట్లు నిర్ధారణ అయింది ఇది గుండె నుండి ఊపిరితిత్తులకు రక్తాన్ని రవాణా చేసే రక్త కేశనాళికల నిరోధానికి దారితీస్తుందని డాక్టర్ చెప్పారు.అతనికి ఆపరేషన్ చేసి 25 రోజులు ఉంచిన తర్వాత సాధారణ వార్డుకు తరలించారు.
సాధారణ వార్డులో 40 రోజుల పాటు ట్రీట్‌మెంట్ తీసుకున్న తర్వాత నరేష్ పూర్తిగా కోలుకున్నాడు. అయితే అతని ఊపిరితిత్తులలో ద్వితీయ సంక్రమణ కోసం బ్రోంకోస్కోపీని పరీక్షించారు ఊపిరితిత్తులలోని కావిటీస్ కారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్లను వచ్చినట్టు వెల్లడించారు. ఈ తరహా వైద్య విధానాలను పూర్తి చేసిన తరువాత వైద్యులు చివరకు నరేష్ నయమయ్యారని మరియు ఇప్పుడు రోజువారీ కార్యకలాపాలను చేయగలరని వైద్యులు వెల్లడించారు.
నరేష్ అన్ని రోజుల పాటు కరోనాతో పోరాడి గెలవడంతో కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఉందని వైద్యులు చెబుతున్నారు. నరేష్ భార్య పీపీఈ కిట్ ధరించి ఆయనతో పాటుగా ఐసీయూలో ఉంది. మేం వద్దని చెప్పినా కూడా ధైర్యంగా ఆయన పక్కన ఉండి, మద్దతుగా నిలిచింది. అతనిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి కరోనాను జయించడంలో భాగమైంది. అయితే ప్రస్తుతం మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా తగ్గిపోలేదనే విషయం గుర్తించి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.