Major Political Parties : జనసేనాని పవన్ కళ్యాణ్.. ఓట్లు కొనుక్కోవచ్చు కదా.?

NQ Staff - November 8, 2022 / 06:49 PM IST

Major Political Parties : జనసేనాని పవన్ కళ్యాణ్.. ఓట్లు కొనుక్కోవచ్చు కదా.?

Major Political Parties : ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. ఎన్నికలంటేనే ఓట్లు కొనుక్కోవడమన్నట్టు. ఓట్లు కొనకుండా రాజకీయం చేయడం అనేది ఈ రోజుల్లో దాదాపు అసాధ్యమన్న భావన బలంగా వినిపిస్తోంది.. అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు పౌర సమాజంలోనూ, ఇంకోపక్క మీడియాలోనూ.! కేంద్ర ఎన్నికల సంఘం, ఎన్నికల్లో డబ్బుతో ఓట్లు కొనే పరిస్థితుల్ని ఎంతలా మార్చాలనుకుంటున్నా అది సాధ్యపడటంలేదు. ఓటు రేటు ఇప్పుడు పది వేల దాకా చేరుకుందన్నది నిష్టుర సత్యం.

జనసేనాని ఎందుకు ఓట్లు కొనకూడదు.?

ప్రధాన రాజకీయ పార్టీలు ఓట్లు కొనకుండా రాజకీయాలు చేయలేవు. మునుగోడు ఉప ఎన్నికలో ఏం జరిగిందో చూశాం. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగానూ ఓట్ల కొనుగోలు జరిగింది. స్థానిక ఎన్నికల్లో డబ్బే ఫలితాల్ని శాసించింది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొన్న కౌలు రైతులకి, ఇప్పుడేమో ఇప్పటం గ్రామస్తులకీ డబ్బులు పంచుతున్నారు ‘సాయం’ పేరుతో. ఈ డబ్బుల్ని జనసేన పార్టీ, వచ్చే ఎన్నికల కోసం వినియోగించు కోవచ్చు కదా.? అని జనసేన మద్దతు దారులే కొందరు జనసేన అధినేతకు సూచిస్తున్నారు.

జనసేన కూడా 2019 ఎన్నికల్లో కొన్ని చోట్ల డబ్బులు పంచిందన్న విమర్శ లేకపోలేదు. అది ఉత్త రాజకీయ విమర్శ మాత్రమేననీ, డబ్బులు పంచి వుంటే ఎన్నోకొన్ని సీట్లు జనసేనకు వచ్చి వుండేవనీ ఆ పార్టీ నేతలు చెబుతుంటారు. ఎవరి గోల వారిది.!

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us