అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి హీరో మహేష్ బాబు ఆపన్న హస్తం

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఓ చిన్నారికి అండగా నిలిచి ప్రాణాలు కాపాడారు. అయితే ఆంధ్రప్రదేశ్ కు రాష్ట్రానికి చెందిన డింపుల్ అనే చిన్నారి కాల్సిఫైడ్ పల్మనరీ వాల్వ్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంది. దీనితో ఆ చిన్నారి ఆపరేషన్ కు కావలసిన సాయాన్ని అందజేశారు. అయితే ముందుగా ఆ చిన్నారి గుండెకు సంబందించిన వ్యాధితో బాధపడుతూ ఉంది. ఇక ఆ తరువాత ఈ అరుదైన వ్యాధి కూడా తోడయ్యింది.

 

దీనితో ఆపరేషన్ కోసం ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబానికి మహేష్ అండగా నిలిచాడు. అయితే ఆ చిన్నారి ఆపరేషన్ ఖర్చు అంతా మహేష్ భరించాడని, ట్రీట్మెంట్ కూడా జరిగిందని, ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యం మెరుగు పడిందని.. ఈ విషయాన్ని మీతో పంచుకోవడడం ఆనందంగా ఉందని మహేష్ భార్య నమ్రతా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

అలాగే ఆ చిన్నారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని, తమ ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని పేర్కొంది. ఇక ఆపదలో ఉన్న చిన్నారికి మహేష్ సాయం అందించడంతో అభిమానులు పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ సర్కార్ వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా, వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్ ప్రారంభం కానుంది.

 

Advertisement