MahaNadu : మా వల్ల కాదంటూ.. మహానాడులో చేతులెత్తేశారు..

MahaNadu : తెలుగుదేశం పార్టీ రెండు రోజుల డిజిటల్ మహానాడు కార్యక్రమం తొలి రోజు ఇవాళ గురువారం ముగిసింది. రెండో రోజు రేపు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు. మొదటి రోజు మొత్తం ఆరు తీర్మానాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రస్తుతం జరుగుతున్న నష్టం తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చినా పూడ్చలేని స్థాయిలో ఉందని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలోని జగన్ సర్కారు పాలనను స్టేట్ టెర్రరిజంగా అభివర్ణించారు. ఈ మేరకు తీర్మానం కూడా చేయటం గమనార్హం.

MahaNadu : tdp mahanadu updates
MahaNadu : tdp mahanadu updates

రెచ్చిపోయిన అచ్చెన్న

టీడీపీ ఏపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు తన నోటి దురుసుతనాన్ని మరోసారి నిరూపించుకున్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకి క్లీన్ చిట్ వచ్చిందంటూ మహానాడులో సంతోషం వ్యక్తం చేసిన ఆయన ఈ కేసు వంకతో కొంత మంది ఇన్నాళ్లూ తమ అధినేత పట్ల కుక్కల్లా మెరిగారంటూ పరుష పదజాలం వాడారు. ఆ వెధవలంతా ఇప్పుడు ఏం జవాబు చెబుతారు అని మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆలస్యమైనా చివరికి న్యాయమే విజయం సాధిస్తుందని చెప్పారు. ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు ప్రతివిమర్శలు చేసే సమయంలో తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోవటం దురదృష్టకరమనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అనితోపదేశం : MahaNadu

ఏపీలో నియంత పాలన నడుస్తోందని తెలుగుదేశం పార్టీ మహిళా నేత వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. రెండేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో జనానికి ఒరిగిందేమీ లేదని తేల్చిచెప్పారు. తమ అధ్యక్షుడు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు డెవలప్మెంట్ ని, సంక్షేమాన్ని రెండు కళ్లలా భావించారని చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయటంలో ఫెయిలైన జగన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ అతిసాధారణ ప్రతిపక్ష పార్టీ లీడర్ మాదిరిగా రొటీన్ డిమాండ్ చేశారు. కొవిడ్ కష్టకాలంలో కూడా ఏపీ గవర్నమెంట్ నిత్యావసరాల ధరలు పెంచి, పన్నులు వేసి, ప్రజల రక్తాన్ని పీల్చుతోందంటూ వంగలపూడి అనిత క్రూరమైన విమర్శలు చేశారు. మొత్తానికి మహానాడు పేరుతో అధికార పార్టీని ఆడిపోసుకున్నారని జనం అంటున్నారు.