MahaNadu : బిగ్గెస్ట్ జోక్ ఆఫ్ మహానాడు-2021.. కడుపుబ్బా నవ్వుకోవటం గ్యారెంటీ..

MahaNadu : తెలుగుదేశం పార్టీ ఏటా చేపట్టే మహానాడు కార్యక్రమం ఈసారి కూడా జరిగింది. నిన్న, ఇవాళ రెండు రోజుల పాటు ఆన్ లైన్ లో నిర్వహించారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు నేతలు పాల్గొని ప్రసంగించారు. అయితే తెలంగాణకు చెందిన మహిళా నాయకురాలు పద్మావతి మాట్లాడిన మాటలు అందరి కన్నా చాలా భిన్నంగా ఉన్నాయి. ‘బిగ్గెస్ట్ జోక్ ఆఫ్ మహానాడు-2021’గా నిలిచాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. చంద్రబాబు, లోకేష్, ఎల్.రమణ వంటి నేతలను ఆమె ఆకాశానికెత్తడాన్ని అతిశయోక్తికే అతిశయోక్తిగా చెప్పుకోవచ్చని అంటున్నారు. పద్మావతి చాలా ఎమోషనల్ గా మాట్లాడినట్లు ఎల్లో మీడియా ఒక వార్తను పబ్లిష్ చేసింది. దాన్ని చదివినవారు కడుపుబ్బా నవ్వుకోవటం గ్యారెంటీ.

MahaNadu : tdp digital mahanadu-2021 updates
MahaNadu : tdp digital mahanadu-2021 updates

పెద్ద సార్.. పెద్ద మనసు చేసుకోండి..

టీడీపీ అధినేత చంద్రబాబును పద్మావతి పెద్ద సార్ అని సంబోధించారు. మీకోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని, అందుకే మీరు ఇక్కడికి తప్పకుండా రావాలని ఆహ్వానించారు. మీరు హైదరాబాద్ లో ఉంటే కరోనా పరిస్థితులు చక్కబడేవని లోకల్ ప్రజలు అనుకుంటున్నట్లు ఆమె అభిప్రాయపడ్డారు. చంద్రబాబును జాతీయ స్థాయి నేత అని పొగిడారు. మీరు ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటే బాగోదని, దీనివల్ల తెలంగాణలో అడుగంటిపోతున్నామంటూ పద్మావతి చాలా ఫీలయ్యారు. పెద్ద మనసు చేసుకొని మా గురించి కూడా కాస్త ఆలోచించండి సార్ అని రిక్వెస్ట్ చేశారు. టీటీడీపీ చీఫ్ ఎల్.రమణ, రావుల, అరవింద్ ఎట్సెట్రా ఎట్సాట్రా లీడర్లు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారని ఆమె మస్తు పొగిడారు.

అందరికీ భయమే: MahaNadu

‘‘చంద్రబాబు గారూ.. మీరు తెలంగాణలో నిలబడితే మిగతా పార్టీల వాళ్లందరూ మిమ్మల్ని చూసి భయపడతారు. నీటిలో నుంచి బయటపడ్డ చేపల మాదిరిగా గిలగిలా కొట్టుకుంటారు. మీరు అన్ని కులాల, అన్ని మతాల ప్రజల మనసుల్లో కొలువై ఉన్నారు. లోకేష్ బాబులో ఎంతో మార్పు వచ్చింది. ఆయన మాటలు గుండె లోతుల్లో నుంచి వస్తున్నాయి. కార్యకర్తలను ఆప్యాయతతో హత్తుకుంటున్నారు. మీరు, లోకేష్ తెలంగాణ ప్రజల కోసం పక్షం రోజులకొకసారి సమయం కేటాయించండి. మమ్మల్ని నెగ్లెక్ట్ చేయొద్దు’’ అని పద్మావతి వేడుకున్నారు. ఈ సీరియస్ కామెడీ ఎపిసోడ్ పై చంద్రబాబు స్పందించారు. ‘‘పార్టీ పుట్టిందే హైదరాబాద్ లో. తెలుగు ప్రజల కోసం’’ అంటూ తనదైన శైలిలో చక్కని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.