అచ్చెన్న చేయాల్సిన రాజకీయం చేస్తున్నాడు.. లోకేష్‌కు ఎర్త్ ఖాయం 

Surya - November 9, 2020 / 04:30 PM IST

అచ్చెన్న చేయాల్సిన రాజకీయం చేస్తున్నాడు.. లోకేష్‌కు ఎర్త్ ఖాయం 
ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో నెలకొన్న అంతర్గత సమస్యల్లో ముఖ్యమైనది అచ్చెన్నాయుడు వెర్సెస్ లోకేష్.  అచ్చెన్నాయుడును అధ్యక్షుడిని చేయడం లోకేష్‌కు ససేమిరా ఇష్టం లేదు.  చివరి వరకు తండ్రి నిర్ణయాన్ని మార్చాలని తెగ ట్రై చేశారు.  కానీ చంద్రబాబు మాత్రం పార్టీ కంటూ కొన్ని లెక్కలు ఉంటాయి కాబట్టి చినబాబుకు నచ్చజెప్పి అచ్చెన్నను అధ్యక్షుడిని చేశారు.  పదవిలో అయితే కూర్చోబెట్టారు కానీ ఆయన్ను డమ్మీని చేయడానికి చాలా ప్రయత్నాలే సాగాయి.  ఇప్పటికీ సాగుతున్నాయి.  పార్టీలో ప్రతి కీలక నిర్ణయం అచ్చెన్నాయుడు నోటీసుకు వెళ్లకుండానే తీసుకోబడుతోంది.  ఇది పసిగట్టిన అచ్చెన్నాయుడు మొదట్లో మౌనంగానే ఉన్నట్టు కనిపించారు.
lokesh unhappy with Acham Naidu as AP TDP head

lokesh unhappy with Acham Naidu as AP TDP head

కానీ తాను చేయాల్సింది తాను చేస్తున్నారు ఆయన.  మెల్లగా జిల్లా అధ్యక్షులతో మంతనాలు స్టార్ట్ చేశారు.  తనను రాష్ట్ర స్థాయిలో పైకి లేవకుండా తొక్కవచ్చు కానీ శ్రీకాకుళంలో తొక్కలేరు కదా అనే ఉద్దేశ్యంతో ముందుకెళుతున్నారు.  అధ్యక్షుడి  హోదాలో ఆయన మాట హైకమాండ్ వద్ద చెల్లుబాటు కాకపోయినా జిల్లాలో మాత్రం గట్టిగానే పనిచేస్తోందట. అందుకే ఆయన జిల్లా మీద పట్టు పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారట.  వచ్చే ఎన్నికల నాటికి జిల్లా మొత్తం తన వెనకే ఉండేలా  పనిచేస్తున్నారట.  జిల్లాలోని నియోజకవర్గాల్లో, మండలాల్లో పార్టీ పనులు ఎలా సాగుతున్నాయి, బలోపేతానికి ఏం చేస్తే మంచిది లాంటి విషయాలను చర్చిస్తున్నారట.  శ్రీకాకుళం అంటేనే కింజారపు ఫ్యామిలీకి పెట్టని కోట.  వారి కుటుంబం అంటే అక్కడి నేతలకు మంచి గౌరవం.
ప్రస్తుతం ఆ కుటుంబానికి అచ్చెన్నాయుడే పెద్ద.  అందుకే ఆయనకు మద్దతు పెరుగుతోందట.  పైగా ఆయన విశాఖను రాజధానిగా చేస్తామంటున్న ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాను ఎందకు చేయదు.  ఇక్కడే రాజధాని పెడితే ఉచితంగా భూములు సమీకరించే బాధ్యత తనది అంటూ కొత్త డిమాండ్ లేవనెత్తారు.  అచ్చెన్నాయుడు అడుగుతున్న డిమాండ్ జరగదని అందరికీ తెలుసు.  శ్రీకాకుళంలో పాలన రాజధాని అంటే జగన్ అస్సలు ఒప్పుకోరు.  అయన మనసులో ఆ ఊహ కూడ లేదు.  అందుకే అచ్చెన్న పదే పదే అడుగుతున్నారు.  దాన్ని విని శ్రీకాకుళం వాసులు పొంగిపోతున్నారు.  ఇలా 2024 నాటికి శ్రీకాకుళంలో పూర్తి పట్టు సాధించి పార్ట్ పరంగా తన మాటే నెగ్గేలా చూసుకుని  లోకేష్‌కు షాకివ్వాలనేది అచ్చెన్న ప్లాన్ కావొచ్చు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us