Nara Lokesh With National Media : సబ్జెక్ట్ లేని లోకేష్.. ఆర్నాబ్ దెబ్బకు పరువు మొత్తం పాయే..!
NQ Staff - September 18, 2023 / 12:42 PM IST

Lokesh Unable Answer Arnab Goswami Questions :
సరుకు లేదు సంగతి లేదు.. సబ్జెక్ట్ లేదు ఆబ్జెక్ట్ లేదు.. బబ్రాజమానం భజగోవిందం.. అంత వట్టిదే డబ్బా అన్నట్టు ఉంది లోకేష్ పరిస్థితి. ఏదో నాలుగు ముక్కలు పట్టీబట్టుకుని ఢిల్లీకి పొలోమంటూ వెళ్లిపోయాడు. చంద్రబాబు అరెస్ట్ ను కుట్ర పూరితంగా జగన్ చేయించాడిన జాతీయ మీడియా ఛానెళ్లకు చెప్పేసి ఏదో సింపతీ క్రియేట్ చేసుకోవాలని ఎగేసుకుంటూ వెళ్లాడు లోకేష్. అసలే లోకేష్ మాట్లాడితే ఎవరికీ ఏమీ సరిగ్గా అర్థం కాదు. ఏదో చెప్పబోయి ఇంకేదో అనేస్తుంటాడు. ఇక్కడ తనకు డబ్బా కొట్టే వారి దగ్గరే సరిగ్గా మాట్లాడలేని వాడు.. ఢిల్లీలో జాతీయ మీడియా ముందు ఏదో చెప్పేస్తా అంటూ డబ్బా కొటుకుంటూ వెళ్లాడు.
జాతీయ మీడియా ముందు మాట్లాడటం అంటే ఎల్లో మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చినట్టు కాదు కాదు. ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే ఆర్నాబ్ గోస్వామి లాంటి వారి ముందు మాట్లాడాలంటే లోకేష్ కు ఎంత సబ్జెక్ట్ ఉండాలి. కానీ అవేం లేకుండాను నాలుగు ముక్కలు ముక్కుమీద పెట్టుకుని వెళ్లి అడ్డంగా దొరికిపోయాడు నారా లోకేష్. ఈయన చదువుకుని వెళ్లిన సమాధానాలు వేరు.. అక్కడ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు వేరు అన్నట్లుగా పరిస్థితి మారడంతో ఇక మేన మామ మాదిరి సమాధానాలు వెతుక్కొలేక అదీ.. అదీ.. అంటూ రాగాలు తీయడం ఆయన వంతు అయిపోయింది.
మన ఎల్లో మీడియాను మేనేజ్ చేసినట్టు కాదు కదా జాతీయ మీడియాను మేనేజ్ చేయడం అంటే. ఢిల్లీ వెళ్లేముందు సబ్జెక్ట్ మీద, కేసు మీద పూర్తి అధ్యయనం చేసి వెళ్తే కాస్తో కూస్తో మాట్లాడగలిగే వాడు. కానీ అది చేతకాక.. నాలుగు ఇంగ్లీష్ ముక్కలు పట్టుకుని ఢిల్లీలో లేపుతాం.. ఊపుతాం అనుకుని వెళ్లి నూతిలో పడ్డట్టు అయింది లోకేష్ పరిస్థితి. ఆర్నాబ్ గోస్వామి అడిగే ప్రశ్నలకు సమాదానాలు చెప్పలక నీళ్లు మింగాల్సిన పరిస్థితి వచ్చింది. ఆర్నాబ్ దెబ్బకు లోకేష్ చిరిగి చేట అయ్యింది. మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లోనే పప్పు అనిపించుకున్న లోకేష్.. ఇప్పుడు జాతీయ మీడియాలో కూడా సబ్జెక్ట్ లేని పప్పు అని నిరూపించుకున్నాడు.
ఆర్నాబ్ గోస్వామి తన మేథస్సుతో ఈ ప్రశ్నలు సంధించాడు..
అసలు టెండర్లే లేకుండా రూ.370 కోట్లు అడ్వాన్ గా ఎందుకు పేమెంట్ చేశారు..?
ముందుగా ఒప్పందం చేసుకున్న ప్రకారం సీమెన్స్ కంపెనీ 90 శాతం నిధులు జమచేయకముందే.. ప్రభుత్వ వాటా కింద 10% భాగం నగదును ఎందుకు ముందే జమ చేశారు..?
-ముందే సీమెన్స్ ఇండియా, డిజైన్ టెక్ సంస్ధలతో డీల్ కుదుర్చుకుని, స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ని ఏర్పాటు చేసి, టెండర్ లేకుండా నిధులు రిలీస్ చేశారా..?
ఈ ఒప్పందం సరిగ్గా లేదని ఆర్థిక శాఖ ప్రిన్సపల్ సెక్రటరీ చెప్పినా మీరు వినకుండా ఎందుకు నిధులు మంజూరు చేశారు అంటూ ఆర్నాబ్ గట్టి ప్రశ్నలు వేసే సరికి లోకేష్ కు చెమటలు పట్టేశాయి. సమాధానాలు లేక, తప్పించుకోవడానికి దారిలేక బెదిరిపోయాడు.
ఈ మాత్రం దానికి ఢిల్లీ దాకా వెళ్లి పరువు పోగొట్టుకోవడం ఎందుకో అని అంటున్నారు టీడీపీ కార్యకర్తలు. లోకేష్ పరువు తెలుగు రాష్ట్రాల్లో పోయింది సరిపోదా.. ఢిల్లీకి వెళ్లి మరీ పరువు తీసుకోవాలా అంటూ అడుగుతున్నారు. ఇలాంటి నాయకుడిని మనం నమ్ముకుంటే మన పరువు కూడా పోతుందేమో అని భయడపుతున్నారు టీడీపీ కార్యకర్తలు. ఈయన కంటే బాలయ్యనే బెటర్ అనేస్తున్నారు మరికొందరు అయితే.