Kodi Pandalu : హైద్రాబాద్‌లో కోడి పందాలు : పరారీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని.!
NQ Staff - July 7, 2022 / 09:23 AM IST

Kodi Pandalu : హైద్రాబాద్‌లోని పటాన్‌చెరు ప్రాంతంలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు పలువురు పందెంరాయళ్ళను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. పలువురు ప్రముఖులు, పోలీసుల రాకతో తెలివిగా తప్పించుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది.

Kodi Pandalu in Hydrabad ex TDP Chinthamaneni Prabhakar
రాజకీయాల్లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనిపించుకున్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా తప్పించుకున్నవారిలో వున్నారట. పోలీసుల కళ్ళుగప్పి చింతమనేని ప్రభాకర్ తృటిలో తప్పించుకున్నట్లు మీడియాలో వార్తా కథనాలు దర్శనమిస్తున్నాయి.
కొంతకాలంగా చింతమనేని మకాం పటాన్‌చెరు ప్రాంతంలోనే..
గత కొద్ది రోజులుగా చింతమనేని ప్రభాకర్ పటాన్‌చెరు ప్రాంతంలోనే మకాం వేశారట. అక్కడే ఆయన కోడి పందాల్ని నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. పక్కా సమాచారంతోనే పోలీసులు దాడులు చేశారని అంటున్నారు. ఇద్దరు వ్యక్తులు ఈ దాడుల్లో అరెస్టు కాగా, వారి నుంచి ఏకంగా 100 కోళ్ళను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పెద్ద మొత్తంలో నగదు కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగిందనీ, సుమారు 10 లక్షల వరకూ నగదు లభ్యమైందనీ తెలుస్తోంది.
సాధారణంగా సంక్రాంతి సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలు జరుగుతుంటాయి. అవి ఇతర జిల్లాలకూ పాకాయి. తెలంగాణలోనూ సంక్రాంతి సమయంలో కోడి పందాలు జరగడం ఇటీవలి కాలంలో పెరుగుతూ వస్తోంది. సాధారణ రోజుల్లో కోడి పందాలు చాలా చాలా అరుదు.