లోకేష్ బాబుపై ఇంత దారుణంగా విరుచుకుపడ్డాడెంటి మంత్రి కొడాలి నాని

Admin - January 6, 2021 / 06:47 PM IST

లోకేష్ బాబుపై ఇంత దారుణంగా విరుచుకుపడ్డాడెంటి మంత్రి కొడాలి నాని

ఏపీ మంత్రి కొడాలి నాని తెలుగుదేశం పార్టీ నాయకుల పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయన మాట్లాడుతూ.. చంద్రబాబుకు వయసు మీద పడ్డ కూడా ఆ రక్తం చల్లారడం లేదు. పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా మతాల, కులాల గురించి మాట్లాడటం.. ముఖ్యమంత్రి క్రిస్టియన్, హోమ్ మినిస్టర్ క్రిస్టియన్, డిజిపి క్రిస్టియన్ అని మాట్లాడుతున్నాడు. అంటే చంద్రబాబు ఉద్దేశ్యంలో క్రిస్టియన్ లు.. క్రిస్టియన్లకే పనిచేస్తారు ! ముస్లింలు ముస్లింలకే పనిచేస్తారు..! హిందువులు హిందువులకే పనిచేస్తారు అనే విధంగా భావిస్తున్నాడు.

కానీ జగన్మోహన్ రెడ్డి అన్ని కులాలను, మతాలను సమానంగా చూస్తాడు. చంద్రబాబు మాత్రం తన ఒక్క కులానికి మాత్రమే మంచి చేయాలనీ చూస్తాడు. అమరావతిలో తన కులస్తులు భూములు కోల్పోతున్నారని వారికే మద్దతు పలుకుతున్నాడు. అంత వయసు వచ్చిన బుద్ధి లేకుండా మాట్లాడుతున్న చంద్రబాబును రాష్ట్ర ప్రజలు గమనించాలి.

ఇక లోకేష్ గురించి మాట్లాడుతూ.. లోకేష్ అనేవాడు ఒక పప్పు నాయుడు.. వాళ్ళ బాబు నుంచే కాలేదు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం. అలాంటిది ఈ పప్పు నాయుడు వల్ల ఏమైతది. జగన్మోహన్ రెడ్డి ఒక శక్తి, ఆయనో వ్యవస్థ. ఈ పప్పుగాడు తినటం, పందిలాగా పడుకోవడం. జగన్ పెట్టిన అభ్యర్థి చేతిలో ఓడిపోయిన చిన్న మిడత ఈ లోకేష్. ఏదో అయ్యా, తాత పెట్టిన భిక్షతో పదవులు చేపట్టి పిచ్చపిచ్చ మాట్లాడితే మూతిపండ్లు రాలుతాయని ఒక రేంజ్ లో లోకేష్ పై కొడాలి నాని విరుచుకుపడ్డారు.

Read Today's Latest Videos in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us