Kalyan Ram: ఎన్టీయార్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు: కళ్యాణ్ రామ్ స్పందన ఇదీ.!

NQ Staff - September 22, 2022 / 04:42 PM IST

160101Kalyan Ram: ఎన్టీయార్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు: కళ్యాణ్ రామ్ స్పందన ఇదీ.!

Kalyan Ram: సినీ నటుడు, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్, తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించాడు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీయార్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు విషయమై.

తన తాత స్వర్గీయ నందమూరి తారకరామారావు పేరు మీద ‘ఎన్టీయార్ ఆర్ట్స్’ అనే బ్యానర్ స్థాపించి పలు విజయవంతమైన సినిమాల్ని ఈ బ్యానర్‌లో ఆయన నిర్మించిన సంగతి తెలిసిందే.

రాజకీయ లాభం కోసం ఈ అంశాన్ని వాడుకోవద్దు..

Kalyan Ram Responded Regarding Change Of NTR Health University

Kalyan Ram Responded Regarding Change Of NTR Health University

ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల విద్యార్థులకు (ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో) నాణ్యమైన వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ మహా విద్యాలయానికి స్వర్గీయ ఎన్టీయార్ అంకురారప్పణ చేశారని కళ్యాణ్ రామ్ తన ట్వీటులో పేర్కొన్నారు.
‘ఈ వైద్య ఆరోగ్యవ విశ్వ విద్యాలయం దేశంలోనే అత్యుత్తమంగా అభివృద్ధి చెందింది. నైపుణ్యం కలిగిన చాలామంది వైద్య నిపుణుల్ని దేశానికి అందించింది..’ అని చెప్పారు కళ్యాణ్ రామ్.

తెలుగు రాష్ట్రాల్లో వైద్య అధ్యయనాల మెరుగుదలకు ఎన్టీయార్ చేసిన కృషిని స్మరించుకునేందుకు విశ్వ విద్యాలయానిక ిడాక్టర్ ఎన్టీయార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని పేరు పెట్టారనీ, ఏ రాజకీయ పార్టీ అధికారంలో వున్నా ఇరవై ఐదేళ్ళకు పైగా ఉనికిలో వున్న ప్రతిష్టాత్మక విశ్వ విద్యాలయం పేరుని మార్చడం బాధ కలిగించిందని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు.

‘కేవలం రాజకీయ లాభం కోసం చాలామందికి భావోద్వేగాలతో ముడిపడి వున్న ఈ అంశాన్ని వాడుకోవడం తప్పు..’ అని కళ్యాణ్ రామ్ స్పష్టం చేశారు.