Jeffery Sachs Praised AP Govt Students : జగన్ సంస్కరణలకు ప్రపంచ మేథావుల ప్రశంసలు.. మన స్టూడెంట్ల ప్రతిభ భేష్..!
NQ Staff - September 20, 2023 / 06:02 PM IST

Jeffery Sachs Praised AP Govt Students :
ఆలోచన.. ఆచరణ.. ఈ రెండూ ఉన్నోడే సీఎం జగన్. మారుమూల పల్లెల్లో బతుకుతున్న వారికి కూడా అద్భుతమైన స్కిల్స్ ఇప్పించాలనేది ఆయన ఆలోచన. ఎందుకంటే ఇప్పటి జనరేషన్ లో చదువు, స్కిల్స్ ఉంటేనే పిల్లలకు బంగారు భవిష్యత్ ఉంటుందనేది జగన్ కు బాగా తెలుసు. అందుకే ఆయన విద్యార్థుల కోసం ఎన్నో విద్యా సంస్కరణలు చేపడుతున్నారు. ఆయన ప్రయత్నాలకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మామూలుగా మారుమూల స్కూలు పిల్లలు స్కూళ్లో మాట్లాడాలంటేనే భయపడుతారు. కానీ పెద్ద పెద్ద ప్రొఫెసర్ల ఎదుట ఏమాత్రం సంశయం లేకుండా ప్రసంగిస్తున్నారు.
తమ స్కూళ్లు ఇప్పుడు ఎలా ఉన్నాయో వాళ్ళే గర్వంగా ప్రచారం చేస్తున్నారు. తమ విద్యావిధానం ఎంత గొప్పగా మారిందో వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్లుగా మారి దేశవిదేశాల్లో ప్రచారం చేస్తున్నారు. తమ బంగారు భవిష్యత్ కోసం సీఎం జగన్ ఏ స్థాయిలో కృషి చేస్తున్నారో, ఎలాంటి ఫలితాలను అందిస్తున్నారో ఏకంగా ఐక్యరాజ్యసమితి సాక్షిగా చెబుతున్నారు. పిల్లలే స్వయంగా చెబుతుంటే పెద్ద పెద్ద ప్రొఫెసర్లు నోరెళ్ళబెట్టి వినాల్సిన రోజులు వచ్చాయి. ఏంటి వీరంతా ప్రభుత్వ స్కూల్ పిల్లలా అని పెద్ద ఎద్ద మేథావులు, శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు.
జగన్ చేపట్టిన నాడు నేడు ప్రోగ్రామ్ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. విద్యార్థులకు ట్యాబ్ లు, విద్యా కానుకలు, బ్యాగులు, పుస్తకాలు, డిక్షనరీలు, బెల్టు, పౌష్టికాహారం పంపిణీ . వంటివి ఐక్యరాజ్య సమితిలో ప్రత్యేకంగా చర్చకు వచ్చాయి. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో సుస్థిర -అభివృద్ధికి సంబంధించి ఉన్నత స్థాయి రాజకీయ సదస్సు (హై లెవెల్ పొలిటికల్ ఫోరం) న్యూయార్క్ లోని ఐరాస ప్రధాన మెయిన్ ఆఫీసులో నిర్వహించారు. ఇందులో ఏపీ ప్రభుత్వం తరఫున ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టాల్ పెట్టి జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు, పథకాలను ఆవిష్కరించారు.
కెనడా స్కూళ్లు, కాలేజీల సోషల్ ఇన్నోవేషన్ ప్రాజెక్టు ముఖ్య అధికారి జూడీ మన విద్యా సంస్కరణలను ప్రశంసించారు. విద్యారంగంలో బాలికలు సాధించిన ప్రగతిని క్యాలిఫోర్నియా విద్యాశాఖ ప్రతినిధి షెరిల్ అభినందించారు.దాంతో పాటు సెప్టెంబర్ 15 నుంచి 26 దాకా జరిగే స్పెషలత్ ప్రోగ్రామ్ కు ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లకు చెందిన 10 మంది స్టూడెంట్లను అమెరికా తీసుకువెళ్లారు. వీరు అక్కడి వేదికల మీద మన ప్రభుత్వ సంస్కరణలను ప్రజెంటేషన్ ఇస్తుంటే మేధావులు సైతం మంత్ర ముగ్ధులయ్యారు.
ఇక ఏపీ విధానాలు అద్భుతం అంటూ కొలంబియా వర్సిటీ ప్రొఫెసర్ జెఫ్రీ సాచ్ అన్నారు. ఆయన ఏపీ స్టూడెంట్లతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో విద్యా విధానంలో వచ్చిన మార్పుల గురించి తెలుసుకుని మురిసిపోయారు. 42 గౌరవ డాక్టరేట్లు పొందిన ఆయన మన పిల్లల ప్రతిభను చూసి మెచ్చుకోవడం అంటే మాటలు కాదు. ఇక ఐరాస మెయిన్ ఆఫీసులో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు పై జరిగిన సదస్సులో మన స్టూడెంట్లు పాల్గొన్నారు.

Jeffery Sachs Praised AP Govt Students
వారు సమాజ అభివృద్ధి కోసం యువత పాత్రను వివరిస్తుంటే అందరూ ముచ్చటపడిపోయారు. ప్రభుత్వ స్కూళ్ల పిల్లల్లో ఇంత పరిణితి, స్థాయి ఆలోచనా స్థాయి ప్రోదిగొల్పడానికి అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే కారణం అని అందరూ కొనియాడారు. ఇలా జగన్ చేపడుతున్న సంస్కరణలను ప్రపంచం సైతం గుర్తించే స్థాయికి వచ్చాయి. కానీ మన ఏపీలోని ప్రతిపక్ష పార్టీలకు మాత్రం ఇవేమీ కనిపించవు.