JanaSena : కరోనాని జనసేన సైనికులు మాత్రమే జయించారా?..

JanaSena : కొంత మంది నాయకులు కొన్ని సార్లు చేసే కామెంట్లు గురి తప్పిన బుల్లెట్ల మాదిరిగా మిస్ ఫైర్ అవుతుంటాయి. మిస్ అండర్ స్టాండింగ్ చేసుకోవటానికి దారి తీస్తాయి. ఏదో అనబోయి మరేదో అనేసి జనంలో నవ్వుల పాలు అవుతుంటారు. జనసేన పార్టీలోని వన్ అండ్ ఓన్లీ సీనియర్ నేత, పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మొన్న చేసిన వ్యాఖ్యలు కూడా ఇదే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. ‘‘మా పార్టీ సైనికులు (జన సైనికులు) కరోనా వైరస్ నే కరివేపాకులా ఆఫ్ట్రాల్ అని తీసిపారేశారు. ఇక జగన్ ఎంత’’ అని ఆయన సీఎంకి సెటైర్ వేయబోయి విమర్శకులకు పని చెప్పారు. ఈ రాజకీయ వ్యాఖ్యలను రాజమహేంద్రవరంలో చేశారు.

అసలు ఉద్దేశం..

ఫ్యాక్షన్ పాలిటిక్స్ ని ఎదుర్కొనే పవర్ జనసేన పార్టీకి మాత్రమే ఉందని చెప్పటం మనోహర్ మనసులోని ఉద్దేశం. బెదిరించి ఓట్లు వేయించుకోవాలనుకుంటున్న అధికార పార్టీని అడ్డుకుంటాం అని, ఎవరూ భయపడరు అని ఆయన నిర్భయంగా చెప్పారు. రాజమహేంద్రవరం లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్ లను, వార్డు సభ్యులను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంతోషం దాచుకోలేక ఇలా వైఎస్సార్సీపీకి కౌంటర్లు వేయబోయి కామెడీ అయిపోయారు. పంచాయతీ ఎలక్షన్స్ టైమ్ లో జగన్ పార్టీ నుంచి జనసేన సైనికులకు ఎన్నో ఒత్తిళ్లు వచ్చాయని, అయినా వాటన్నింటినీ తట్టుకొని పవన్ కళ్యాణ్ పిలుపుతో నిలబడ్డారని నాదెండ్ల మెచ్చుకున్నారు.

JanaSena Party : janasena party one and only senior leader playing jokes
JanaSena Party : janasena party one and only senior leader playing jokes

రాజకీయ రోగులు: JanaSena

కొవిడ్-19 వైరస్ ని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది చాలా ధైర్య సాహసాలతో జయించారు. కానీ.. నాదెండ్ల మనోహర్ తమ పార్టీ వాళ్లు మాత్రమే ఎదుర్కొన్నారనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ‘‘కరోనానే ఆఫ్ట్రాల్.. జగనెంత?’’ అని ప్రశ్నించారు. తద్వారా ఆయనకు ఆయనే ఒక జోకర్ మాదిరిగా సెల్ఫ్ ప్రొజెక్ట్ చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. జగన్ ని విమర్శించటం కోసం చివరికి ఆ రోగాన్ని కూడా అడ్డం పెట్టుకునేవాళ్లను వైఎస్సార్సీపీవాళ్లు పొలిటికల్ పేషెంట్లుగా అభివర్ణిస్తున్నారు.

Advertisement