janasena : పంచాయితీ ఎన్నికల్లో జనసేన ఉన్నట్లా? లేనట్లా? వారికి పెద్ద అనుమానం వచ్చింది

ap panchayat elections 2021 is janasena contesting
ap panchayat elections 2021 is janasena contesting

janasena : ఏపీ లో జరుగుతున్న పంచాయితీ ఎన్నికలు గందరగోళంగా ఉన్నాయి. మొన్నటి వరకు అధికార పార్టీతో పాటు అన్ని పార్టీల నాయకులు కూడా పంచాయితీ ఎన్నికలు ఉండక పోవచ్చు అంటూ భావించారు. కాని అనూహ్యంగా పంచాయితీ ఎన్నికలకు సుప్రీం కోర్టు నుండి గ్రీన్ సిగ్నల్‌ రావడంతో పాటు సహకరించం అంటూ చెబుతూ వచ్చిన ఉద్యోగ సంఘాలు కూడా ఇప్పుడు సహకరించక తప్పడం లేదు. ఎన్నికలు అంతా సజావుగా సాగుతున్నాయి. ఇప్పటికే మొదటి దశకు నామినేషన్‌ ల పక్రియ కూడా ప్రారంభం అయ్యింది. పంచాయితీ ఎన్నికల్లో పార్టీలతో సంబంధం లేకుండా అభ్యర్థులు పోటీ చేస్తారు. కాని పార్టీల ప్రభావం చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

పంచాయితీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు అన్ని సిద్దం అవుతున్నాయా లేదా అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఉండక పోవచ్చు అనుకున్న జనాలు ఇప్పుడు మాత్రం ఎన్నికలు ఉన్నాయి అనగానే ఠక్కున రెడీ అవ్వడం సాధ్యమేనా అన్నట్లుగా పరిస్థితి ఉంది. ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు అసలు పంచాయితీ ఎన్నికలకు సిద్దం అవుతున్నారా లేదా అనేది కూడా తెలియడం లేదు. పంచాయితీ ఎన్నికల విషయంలో జనసేన పార్టీ మొదటి నుండి కూడా యాక్టివ్‌ గా లేదు. ఎన్నికల విషయంలో జనసేన అధినాయకుడు ఒకటి రెండు సార్లు మాట్లాడినా కూడా తర్వాత పెద్దగా పార్టీ నాయకులతో చర్చలు జరిపింది లేదు.

జిల్లా నాయకులకు పార్టీ తరపున అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగుతుంది. ఆ విషయంలో పూర్తి హక్కులను వారికి ఇచ్చినట్లుగా ఈ సందర్బంగా పార్టీ గతంలో పేర్కొంది. కాని వారు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదు. ఇప్పటి వరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసిందే లేదు. కనుక పంచాయితీ ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ పెద్దగా ప్రభావం చూపించడం కష్టం అంటున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో వారు ఎంత మేరకు ప్రభావం చూపిస్తారు అనే విషయంలో క్లారిటీ అయితే లేదు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికలు ప్రధానంగా అధికార వైకాపా మరియు ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీల మద్య జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement