Perni Nani: పేర్ని నాని కాన్వాయ్‌ని అడ్డ‌గించి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేసిన జ‌న‌సేన‌

Perni Nani: గ‌త కొద్ది రోజులుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌ర్సెస్ వైసీపీ అన్న చందాన ర‌చ్చ న‌డుస్తుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. జ‌గ‌న్‌తో పాటు వైసీపీ మంత్రుల‌పై ఫుల్ ఫైర్ అయ్యాడు. ఈ క్ర‌మంలో మంత్రులు కూడా ఆయ‌న‌పై ఫైర్ అయ్యారు. స్పీచ్‌ల‌తో పాటు ట్వీట్స్‌తోను ప‌వ‌న్ వైసీపీ మంత్రుల‌ని ఎండ‌గ‌డుతున్నాడు.

Janasainiks Stops Perni nani and Ask Sorry
Janasainiks Stops Perni nani and Ask Sorry

తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ళ క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే అంటూ వైసీపీ నేతల పై పవన్ కళ్యాణ్ ట్విట్ చేయగా…. దానికి కౌంటర్‌ పేర్ని నాని ట్వీట్ చేశారు. జనం ఛీత్కారాలు, ఓటర్ల తిరస్కారాలు, తమరి వైవాహిక సంస్కారాలు, వరాహ సమానులకు న’మస్కా’రాలు అంటూ పేర్ని నాని ట్వీట్ చేశారు.

చిరంజీవి నాతో మాట్లాడారని తెలిపారు. సినీ ఫంక్షన్‌లో జరిగిన ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారని నాని పేర్కొన్నారు. ఆ ఫంక్షన్‌లో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో తాము ఏకీభవించమన్నారని మంత్రి తెలిపారు. ఆన్‌లైన్ టికెటింగ్ కొత్తగా పెట్టింది కాదని పేర్ని నాని అన్నారు. దేశంలో కిరాయికి రాజకీయ పార్టీ పెట్టింది పవన్ కల్యాణ్ ఒక్కరే అని ఆయన మండిపడ్డారు. రాజకీయ పార్టీని టెంట్‌హౌస్‌లా అద్దెకు ఇస్తున్నారని పేర్నినాని ఎద్దేవా చేశారు.

ప‌వ‌న్‌పై త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేసిన క్ర‌మంలో ఆయ‌న‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పర్యటనకు గురువారం నాడు ఏపీ మంత్రి పేర్ని నాని వచ్చారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఇంటికి సమీపంలో జనసేన కార్యకర్తలు మంత్రి పేర్ని నాని కాన్వాయ్ ను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నానికి వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారు.

మరో వైపు పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన మంత్రి పేర్నినాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు జనసేన కార్యకర్తలు. వైసీసీ వ‌ర్సెస్ ప‌వ‌న్ రచ్చ ఇప్ప‌ట్లో ఆగేలా క‌నిపించ‌డం లేదు.