Jana Sena Symbol Debate In Next Election : వచ్చే ఎన్నికల్లో జనసేన గుర్తు ఉండదా.. పవన్ సైకిల్ గుర్తు మీదనే పోటీ చేస్తారా..?
NQ Staff - September 18, 2023 / 12:48 PM IST

Jana Sena Symbol Debate In Next Election :
అవును.. ఇప్పుడు ఇదే విషయం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. పవన్ కల్యాణ్ జనసేన అనే పార్టీని పెట్టి మొదటిసారి 2014 ఎన్నికల్లోనే పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఎంతలా అంటే ఒక రాజకీయ పార్టీకి రావాల్సిన కనీస ఓట్లు కూడా రాలేదు. దాంతో ఆ పార్టీ గుర్తును కోల్పోయింది. ఇప్పుడు ఆ పార్టీకి గుర్తు లేదు. ఇలాంటి స్థాయిలో ఉన్న పవన్ కల్యాణ్ కూడా జగన్ ను విమర్శించడం మహా విడ్డూరం. 151 మంది ఎమ్మెల్యేలతో దేశంలోనే భారీ మెజార్టీతో గెలిచిన జగన్.. పవన్ విమర్శించడం ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు.
అసలు ఇప్పుడు పవన్ కల్యాణ్ తన పార్టీ జనసేనను రంగంలోకి దింపాలని.. అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించాలనే లక్ష్యంలో అస్సలు లేడు. కేవలం జగన్ ను ఓడించాలనే లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు టీడీపీతో పొత్తులు పెట్టుకోవడం వెనక పెద్ద కథే ఉందని తెలుస్తోంది. ఎందుకంటే జనసేనకు అసలు పార్టీ గుర్తు లేదు. కానీ జనసైనికులు ఇంకా తమ గుర్తు గాజు గ్లాసే అని అందులోనే టీ తాగుతూ ఫోజులిస్తున్నారు. అటు పవన్ కల్యాణ్ కూడా సినిమాల్లో గాజు గ్లాస్ లోనే చాయ్ తాగుతూ నమ్మిస్తున్నాడు. ఇదంతా చూస్తున్న రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం కలుగుతోంది.
అయితే రాబోయే ఎన్నికల్లో పవన్ కల్యాణ్, ఆయన పార్టీ నేతలు గాజు గ్లాసు మీద పోటీ చేయరని తెలుస్తోంది. వారంతా కూడా టీడీపీ గుర్తు మీదనే పోటీ చేస్తారంట. సైకిల్ గుర్తు మీదనే 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారని ఇప్పటికే ఒప్పందం జరిగినట్టు తెలుస్తోంది. అంటే జనసేనకు కేటాయించిన సీట్లలో సైకిల్ గుర్తు మీద జనసైనికులు పోటీ చేస్తారు. అప్పుడు వారు టీడీపీ వారు అవుతారని పవన్ కు మాత్రం తెలియట్లేదు పాపం. అంటే తాము 175 నియోజకవర్గాల్లో పోటీ చేశామని చంద్రబాబు చెప్పుకుంటారు. సైకిల్ గుర్తు మీద పోటీ చేసిన జనసైనికులను చంద్రబాబు తన పార్టీలోకి లాక్కున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.

Jana Sena Symbol Debate In Next Election
కానీ పవన్ కు తన కోసం తిరుగుతున్న జనసైనికుల భవిష్యత్ అవసరం లేదు. కేవలం లైఫ్ మాత్రమే ముఖ్యం. ఆయన మొదటి నుంచి పాటిస్తున్న విధానాలు ఇలాగే ఉంటున్నాయి. కేవలం తన కోసమే తప్ప జనసైనికుల గురించి ఎన్నడూ ఆలోచించింది కూడా లేదు. అంటే ఇప్పుడు జనసైనికులు ఎటు పోయినా సరే పవన్ కు సంబధం లేదన్నమాట. గతంలో తమిళనాడులో కూడా ఇలాంటి పరిస్థితులు జరిగాయి.
అప్పట్లో శరత్ కుమార్ ఓ పార్టీని పెట్టారు. కానీ అన్నాడీఎంకే పార్టీతో ఆయన పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు జయలలిత శరత్ కుమార్ తో పాటు మరొకరికి ఓ టికెట్ ను కేటాయించింది. రెండు ఎమ్మెల్యే సీట్లలో వారిద్దరూ గెలిచారు. కానీ వీరిద్దరూ అన్నాడీఎంకే పార్టీ గుర్తు మీదనే పోటీ చేశారు తప్ప వేరే గుర్తు మీద కాదు. ఐదేండ్ల పాటు వారిద్దరూ పేరుకు శరత్ కుమార్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కానీ ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయింది ఆ పార్టీ. రేపు జనసేన పరిస్థితి కూడా ఇంతే అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి ఏం జరుగుతుందో.