రైతులకోసం ‘ జై కిసాన్ ఉద్యమం ‘ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Admin - December 3, 2020 / 05:44 PM IST

రైతులకోసం ‘ జై కిసాన్ ఉద్యమం ‘  : జనసేన అధినేత పవన్ కళ్యాణ్

ఏపీలో నివర్ తుఫాన్ దెబ్బకు భారీగా పంట నష్టం వాటిల్లింది. దీనితో నష్టపోయిన రైతులను స్వయంగా వెళ్లి పరామర్శిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే దింట్లో భాగంగా నిన్న పాముర్రు, కంకిపాడు, అవనిగడ్డ ప్రాంతాల్లో పర్యటించారు. ఇక రైతులతో పంట నష్టాన్ని అడిగి తెలుసుకొని, నష్టపరిహారం అందేలా ప్రభుత్వంపై వత్తిడి తీసుకొస్తామని భరోసా ఇచ్చాడు. ప్రతిఒక్క రైతుకు ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తామని చెప్పుకొచ్చాడు.

ఇక ఇదిలా ఉంటె తాజాగా పవన్ తిరుపతిలో మీడియాతో సమావేశం అయ్యారు. ఇక దింట్లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. నివర్ తుఫాన్ లో జరిగిన పంట నష్టంపై ఒక నివేదికను సిద్ధం చేస్తున్నామని.. ఇక ఆ నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతామని చెప్పుకొచ్చాడు. రైతుల మీద వైసీపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని మండిపడ్డాడు. జనసేన రైతుల కోసం ఉద్యమించడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

త్వరలో జై కిసాన్ పేరిట ఉద్యమాన్ని చేపడుతున్నామని తెలిపాడు. ఇక రైతులకు పంట నష్టం కింద 35 వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఏపీ సర్కార్ ను కోరుతూ డిమాండ్ చేసారు. అలాగే రైతుల కోసం ఎంతకైనా పోరాడుతామని, పంటకు గిట్టుబాటు ధర, లాభసాటి ధర వచ్చే వరకు ప్రభుత్వంపై వత్తిడి తీసుకొస్తామని పవన్ వెల్లడించాడు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us