Jagapati Babu : ‘‘ఆయన కోసం’’.. దేవుణ్ని ప్రార్థిస్తున్నా..

Jagapati Babu: ఆనందయ్య ఔషధం విషయంలో టాలీవుడ్ సీనియర్ హీరో-కమ్-విలన్ జగపతి బాబు స్పందించారు. కరోనా కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్న మనల్ని కాపాడటం కోసం ప్రకృతిమాత ఆయన రూపంలో వచ్చినట్లు అనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ఆనందయ్య అందిస్తున్న సహజసిద్ధమైన వైద్యానికి సర్కారు నుంచి అనుమతి రావాలంటూ భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానని, ఆవిధంగా ఈ ప్రపంచం కొవిడ్ మహమ్మారి బారి నుంచి సురక్షితంగా బయటపడుతుందని ఆశిస్తున్నానని అన్నారు. ఆనందయ్యని దేవుడు దీవించాలని కోరుకుంటున్నట్లు జగపతి బాబు తెలిపారు. ఈ మేరకు ఆయన ఇవాళ మంగళవారం ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఆనందయ్య పట్ల ఒక సినిమా హీరో ఈవిధంగా రియాక్ట్ కావటం చెప్పుకోదగ్గ విషయమే.

Jagapati Babu

హైకోర్టు ఓకే..

ఆనందయ్య మందును పంపిణీ చేయాలని కోరుతూ దాఖలైన రెండు వ్యాజ్యాలపై విచారణకు ఏపీ హైకోర్టు ఈరోజు అనుమతించింది. వీటిపై ఎల్లుండు గురువారం వాదనలు విననున్నట్లు తెలిపింది. మందు పంపిణీకయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించాలని, తగిన ఏర్పాట్లు కూడా చెయ్యాలని, ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఆనందయ్య మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ సమయంలో ఎలాంటి శాంతిభద్రతల సమస్యా తలెత్తకుండా చూడాలని కోరారు. లోకాయుక్త ఆదేశాల మేరకు ఆ వైద్యాన్ని నిలిపివేసినట్లు పోలీసులు చెబుతున్నారని, అసలు ఇలాంటి ఆర్డర్స్ ని జారీ చేసే అధికారం ఆ సంస్థకు లేదంటూ పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు.

Jagapati Babu

సోమిరెడ్డి ఆశ్చర్యం..

ఆనందయ్య ఔషధాన్ని తయారుచేస్తున్న ప్రదేశాన్ని, మందు పంపిణీని సోమిరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు ఈ రోజు మంగళవారం సందర్శించారు. అక్కడ చోటుచేసుకున్న సంఘటనను చూసి వాళ్లు ఆశ్చర్యపోయారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన ఓ విద్యార్థి పరిస్థితి సీరియస్ గా ఉండటంతో అక్కడికి తీసుకొచ్చారు. సోమిరెడ్డి చూస్తుండగానే అతని కంట్లో ఆనందయ్య కుటుంబ సభ్యులు చుక్కల మందు వేశారు. దీంతో బాధితుడు పావు గంటలోనే తేరుకొని మాట్లాడటం స్థానికులను ఆశ్చర్యపర్చింది. దీనిపై సోమిరెడ్డి స్పందిస్తూ ఇప్పటికైనా నేతలు, ఆఫీసర్లు పాలిటిక్స్ పక్కనపెట్టి ఆనందయ్య మెడిసిన్ పంపిణీ జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.

Jagapati Babu