Jagan vs Kcr : జగన్ ని చూసి కేసీఆర్ నేర్చుకోవాలంటావ్.. అంతేనా?..

Kondala Rao - April 11, 2021 / 05:18 PM IST

Jagan vs Kcr : జగన్ ని చూసి కేసీఆర్ నేర్చుకోవాలంటావ్.. అంతేనా?..

Jagan vs Kcr : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లీడర్లకి భలే ఐడియాలు వస్తుంటాయ్. కాకపోతే అవి వాళ్ల పార్టీని బాగుచేసేవి మాత్రం కావు. ప్రత్యర్థి పార్టీలకు ప్లస్ చేసేవి. అయితే వాటిలో కాస్త ప్రజాకోణం కూడా ఉండటం విశేషం. హస్తం పార్టీ ఎమ్మెల్సీ, ఆ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి ఇవాళ ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి, రాష్ట్ర అధికార యంత్రాంగానికి ఒక సూచన చేశారు. అదేంటంటే నాగార్జునసాగర్ శాసన సభ నియోజకవర్గ ఉపఎన్నికకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 14న అంటే బుధవారం బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. కానీ.. ఆ మీటింగ్ కి నల్గొండ జిల్లా కలెక్టర్, ఎస్పీ అనుమతి ఇవ్వొద్దని జీవన్ రెడ్డి సలహా ఇచ్చారు.

Jagan vs Kcr : congress mlc jeevan reddy advice to cm kcr

Jagan vs Kcr : congress mlc jeevan reddy advice to cm kcr

ఎందుకు?..

పక్క తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో సైతం అదే రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి లోక్ సభ నియోజకవర్గ బైఎలక్షన్ కోసం రేణిగుంటకు సమీపంలో నిర్వహించ తలపెట్టిన సభను నిన్న శనివారం రద్దు చేసుకున్నారు. ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరణ ఇచ్చారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా కొవిడ్-19 వైరస్ బాగా వ్యాప్తి చెందుతున్నందున సీఎం కేసీఆర్ సైతం తన కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేసుకోవాలని జీవన్ రెడ్డి కోరారు. మంచి ఆలోచనే.

అంతటితో ఆగలేదు: Jagan vs Kcr

కేసీఆర్ ఇప్పటికే ఒకసారి హాలియా ప్రాంతంలో మీటింగ్ పెట్టారు. కానీ అప్పటికి ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు. ఇప్పుడు వచ్చింది.. నామినేషన్లు వేశారు. పోలింగ్(17వ తేదీ) కూడా దగ్గరపడుతోంది. అందువల్ల మరోసారి భారీ బహిరంగ సభ పెట్టాలని అధికార పార్టీ టీఆర్ఎస్ భావించింది. అయితే ఓటమి భయంతోనే కేసీఆర్ సెకండ్ మీటింగ్ ఏర్పాటుచేశారని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇంతకీ నాగార్జునసాగర్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితేంటో జీవన్ రెడ్డికి ఏమైనా తెలుసో లేదో. కేసీఆర్ సభ నిర్వహించినా నిర్వహించకపోయినా హస్తం పార్టీకి వచ్చే లాభమేంటో ఆయనకే తెలియాలి. కాకపోతే ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కేసీఆర్‌ మీటింగ్ రద్దు చేసుకుంటే బాగుంటుందనే పాయింట్ మాత్రం నూరు శాతం మెచ్చుకోవాల్సిందే. మొత్తానికి ఏపీ సీఎం జగన్ ని చూసి తెలంగాణ సీఎం కేసీఆర్ నేర్చుకోవాలని అంటున్నాడు. మంచి ఎక్కడ ఉన్నా చూసి నేర్చుకోవటంలో తప్పులేదు కదా.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us