లైఫ్ లో మొట్టమొదటిసారి తల వంచబోతోన్న జగన్, జనం కోసమే అతిపెద్ద త్యాగం !
Admin - December 30, 2020 / 06:27 PM IST

ఏపీలో ఎప్పుడు ఏదో ఒక వివాదం తెర మీదకు వస్తుంటుంది. అయితే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణమే.. కానీ రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్న వారిపై విమర్శలు చేయడం మాత్రం తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నిక కమిషన్ కు మధ్య స్థానిక ఎన్నికల విషయంలో వివాదం సంచలనంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలు నియమించాలని ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నిస్తుంటే.. తాము సిద్ధంగా లేమని అధికార పార్టీ మొండిగా వ్యవహరిస్తోంది.
అంతేకాదు ఇప్పటికే ఈ వ్యవహారంపై పలువురు మంత్రులు ఎన్నికల కమిషనర్ ను ఇస్టానురాజ్యంగా తిడుతూ సంచలనంగా మారారు. ఈసీని విధుల్లో నుండి తొలగించాలని పలుమార్లు ఆరోపణలు కూడా చేశారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూర్చొని మాట్లాడుకోవాలని హై కోర్ట్ ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కు సూచించింది. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం పెట్టించుకోకుండా గాలికి వదిలేసింది. దీనితో హై కోర్ట్ స్వయంగా రంగంలోకి దిగి స్థానిక సంస్థల ఎన్నికల గురించి కీలక ఆదేశాలు జారీచేసింది.
ఇక మూడు రోజుల లోపు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డను కలసి చర్చలు జరపాలని సూచించింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరింది. గతంలో ఎన్ని సార్లు చెప్పిన కనీసం పట్టించుకోలేదని, అందుకోసమే మూడు రోజుల పాటు డెడ్ లైన్ పెట్టినట్లు పేర్కొంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారంపై జగన్ హై కోర్ట్ లో వేసిన పిటిషన్ ను కొట్టి వేసింది ధర్మాసనం.
ఇక మొత్తానికి హై కోర్ట్ పెట్టిన ఆదేశాలతో జగన్ తలవంచి ఎన్నికల కమిషనర్ తో చర్చలు జరపడానికి సిద్ధం అవుతున్నాడట. మరి స్థానిక ఎన్నికల వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో అని ఏపీ ప్రజలు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వాల చర్చలు సఫలం అయితే ఫిబ్రవరి లో స్థానిక సంస్థల ఎన్నికల నగరా మోగనున్నట్లు తెలుస్తుంది.