ఏపీలో ఎన్నికల సంఘంకు ప్రభుత్వంకు మద్య కోల్డ్ వార్ జరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రభుత్వం తప్పించిన నిమ్మగడ్డ రమేష్ మళ్లీ కోర్టుకు వెళ్లి తన పదవిని తెచ్చుకున్నాడు. ఈ సమయంలో ఎన్నికలకు వెళ్తే ఖచ్చితంగా ఎన్నికల సంఘం చాలా కఠినంగా వైకాపా అభ్యర్థుల పట్ల వ్యవహరించే అవకాశం ఉంది. నిమ్మగడ్డ మార్చిలో రిటైర్ అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు ఏ ఎన్నికకు వెళ్లకుండా ఉండాలని జగన్ భావించాడు. ఇటీవల నిమ్మగడ్డ రమేష్ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నాం.. కలెక్టర్ల సమావేశం నిర్వహించి చర్చించేందుకు సిద్దం అయ్యాడు. ఈ సమయంలో సీఎం జగన్ మాత్రం కలెక్టర్లను ఆ సమావేశానికి హాజరు కావద్దనే ఆదేశాలు ఇచ్చారంటూ వార్తలు వచ్చాయి.

ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏప్రిల్ వరకు ఎన్నికలకు వెళ్లేందుకు ఆసక్తిగా లేని జగన్ ఉన్నట్లుండి తన నిర్ణయం మార్చకున్నట్లుగా అనిపిస్తుంది. నిమ్మగడ్డ తనకు ప్రభుత్వం సహకరించడం లేదు అంటూ కోర్టుకు వెళ్ల అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంకు ఖచ్చితంగా ఎదురు దెబ్బ తలిగే అవకాశం ఉంది. కనుక జగన్ ఎన్నికలకు వెళ్లే ఉద్దేశ్యంతో ఉన్నాడు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఏపీలో ఈనెల 25న ఇళ్ల స్థలాలను పంపిణీ చేసేందుకు హడావుడిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటున్నారు. ఇళ్ల పట్టాలు పంపిణీ పూర్తి అయిన తర్వాత ఈనెల చివరి వరకు స్థానిక ఎన్నికలకు ఓకే చెప్పే అవకాశం ఉందని అంటున్నారు.
ఎన్నికలు అడ్డుకుంటే ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. నిమ్మగడ్డ పోయే వరకు ఎన్నికలు నిర్వహించకుండా ఉంటే ఖచ్చితంగా తెలుగు దేశం పార్టీ నాయకులు విమర్శలు చేసే అవకాశం ఉంది. ఆ సమయంలో వైకాపాకు నష్టం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఏపీలో జరుగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం వైకాపా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికలకు రెఫరండెంగా ఈ ఎన్నికలను భావిస్తున్నారు. అందుకే వైకాపా చాలా సీరియస్ గా ఈ ఎన్నికలను తీసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. సీఎం జగన్ ఈ ఎన్నికల్లో గెలుపు ఆధారంగా మంత్రి వర్గంలో మార్పు చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.